ANDHRA PRADESHDEVELOPOFFICIALSTATE NEWS

మార్చి నెల 21 నాటికి బయో మైనింగ్ సైట్ నందు సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్‌ పార్క్‌గా అభివృద్ధి చేయాలి

రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

మార్చి నెల 21 నాటికి బయో మైనింగ్ సైట్ నందు సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్‌ పార్క్‌గా అభివృద్ధి చేయాలి

బయో మైనింగ్ సైట్ నందలి వేస్ట్ డిస్పోజల్ మార్చి 10 నాటికి పూర్తి చేసి మున్సిపల్ కార్పొరేషన్ కి అప్పచెప్పాలి

ఆర్డీఎఫ్ రీ ప్రాసెసింగ్ ఆలస్యం వలన జనవరిలో లెగసీ వేస్ట్ పూర్తి స్థాయిలో చెత్తను తొలగించ లేకపోయాం

రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

అనంతపురము ప్రతినిధి జనవరి 24 యువతరం న్యూస్:

బయో మైనింగ్ సైట్ లో మార్చి 10 నాటికి లెగసీ వేస్ట్ బయోమైనింగ్ యాక్టివిటీని పూర్తి చేయాలనీ, డంపింగ్ యార్డు స్థానే మార్చి 21న మంచి పచ్చదనం ఉండేలా గ్రీన్ స్పేస్‌ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం సాయంత్రం అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు నందు ఉన్న బయోమైనింగ్ సైట్ ను రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవాని రవికుమార్, మున్సిపల్ కమిషనర్ బాల స్వామి, ఈఈ పబ్లిక్ హెల్త్ ఆది నారాయణ, మున్సిపల్ ఈఈ షాకీర్, తదితర అధికారులు, జిగ్మా కంపెనీ ప్రతినిధులు తయారులతో కలిసి పరిశీలించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అనంతపురము ప్రజల చిరకాల వాంఛ అయిన డంపింగ్ యార్డ్ చెత్త తొలగింపు అనేది మార్చి నెల 21 నాటికి నెరవేరనున్నది అని స్పష్టం చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి లెగసీ వేస్ట్ బయోమైనింగ్ యాక్టివిటీ సకాలంలో పూర్తి చేస్తున్నారా లేదా అని పరిశీలించడానికి తాను వచ్చానని తెలిపారు. జిగ్మా కంపెనీ ప్రతినిధులకు సూచిస్తూ మార్చి 10 నాటికి పూర్తి స్థాయిలో బయో మైనింగ్ లెగసీ వేస్ట్ క్లియర్ చేసి, సదరు స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించాలని, ఆ స్థానంలో స్వచ్చంద్ర కార్పొరేషన్ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పచ్చదనం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మార్చి 21న మూడవ శనివారం సదరు బయో మైనింగ్ సైట్ నందు సుందరమైనటువంటి గ్రీన్ స్పేస్‌ పార్క్‌గా తయారు చేసి ప్రారంభించుకుందామని, గౌ. ముఖ్యమంత్రి గారి సమయం అనుకూలం ఉంటే వారు కూడా హాజరయ్యేలా కోరతామని అన్నారు. ఆర్డీఎఫ్ తొలగింపులో జాప్యం నుండి మనం జనవరి నెల ఆఖరికి చెత్త తొలగింపు పూర్తి చేసుకోలేక పోతున్నామన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో మళ్ళీ చెత్త అనేది పేరుకోకుండా ఒక వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ని శాశ్వతంగా అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఫ్రెష్ చెత్తను ప్రాసెసింగ్ కొరకు పక్కనే 2.14 ఎకరాల స్థలం కేటాయించామని, దాని ప్రహరీ గోడ నిర్మాణం రేపటి నుండి చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ అనంతపురము వారికి సూచించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి, రాష్ట్ర మునిసిపల్ శాఖామంత్రి ఈ కార్యక్రమ అమలుకు ఎంతో చిత్త శుద్ధితో పని చేస్తున్నారు అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటు పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి డంపింగ్ యార్డ్‌లో ఉన్నటువంటి లక్షల టన్నుల చెత్తని క్లియర్ చేసేటటువంటి బాధ్యతను తీసుకొని కోట్లాది రూపాయలు వెచ్చించి బయోమైనింగ్ యాక్టివిటీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బయో మైనింగ్ యాక్టివిటీ నందు 90 లక్షల టన్నుల వేస్ట్ ను ప్రాసెసింగ్ చేయగా, అందులో సుమారు 54 లక్షల టన్నుల ప్రాసెస్డ్ చెత్తను 65 శాతం నుండి 75 శాతం పూర్తి చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలుకు వారు కట్టుబడి ఉన్నారని, రాష్ట్రంలో స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అనేక గొప్ప గొప్ప కంపెనీలు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా చేపడుతున్నామని పేర్కొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!