ఘనంగా విశ్వ హిందూ పరిషత్, సామాజిక సమరసత దివస్


ఘనంగా విశ్వ హిందూ పరిషత్, సామాజిక సమరసత దివస్
కర్నూలు ప్రతినిధి జనవరి 16 యువతరం న్యూస్:
విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి విభాగ్ కన్వీనర్ శ్రీమతి మాళిగి పావని ఆధ్వర్యంలో శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం, హరిశ్చంద్ర శరీన్, కర్నూలు లో ఈ రోజు సా.6:30 కు విజ్ఞాన వికాస్ బాల సంస్కార కేంద్రం పిల్లలకు సామాజిక సమరసత అవసరం, సామాజిక సమరసత ను పాటించిన శ్రీరాముడు, శ్రీ కృష్ణుడి గురించి వివరించడం జరిగిందని మాళిగి పావని తెలియజేశారు అనంతరం పీడ నివారణ కోసం. 5 సం.ల లోపు పిల్లలకు దేవుడికి వేసిన రేగుపండ్లు, చెరుకు ముక్కలు అభిశేకించడం జరిగింది అలాగే అందరికీ నువ్వులు, బెల్లం, పప్పులు, బుడ్డలు, ఎండుకొబ్బరి, కలిపిన ప్రసాదం ఇవ్వబడినది. ఈ సందర్భంగా ముగ్గులు పోటీలో పోల్గొన్న చాన్నరులకు,
హారిక – ప్రథమ,
ప్రభ – ద్వితీయ,
మేఘన – తృతీయ బహుమతులు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమంలో మాళిగి అనంత అభిరామ్, చిట్టర్స్ అథర్వ, ఈశ్వర్, మహాలక్ష్మీ, ఉమా, జయ్యమ్మ, కవిత, హేమలత, అరుణ, సోమేశ్వరి, భార్గవి , మంజుళ, రాజేశ్వరి, పుల్లమ్మ, రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.



