ఇది మంచి ప్రభుత్వం. మా పాలనలో అభివృద్ధి జరుగుతోంది
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్


ఇది మంచి ప్రభుత్వం.
మా పాలనలో అభివృద్ధి జరుగుతోంది
సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి టీజీ భరత్
కర్నూలు ప్రతినిధి జనవరి 14 యువతరం న్యూస్:
తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమని, తమ పాలనలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులోని 46వ వార్డు నరసింహారెడ్డి నగర్లో వార్డు ఇంచార్జి, వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధానంలో పనిచేస్తున్నామన్నారు. గతంలో కొందరు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. వారి వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నట్లు చెప్పారు.
ఒక టార్గెట్ పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ జిల్లా ఓర్వకల్లుకు ఇప్పటికే 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చామన్నారు. ఇప్పటికే రిలయన్స్, ఇతర కంపెనీలు పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలన్నారు. వార్డులోని అబ్దుల్ కలాం పాఠశాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధు, బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్, కార్పొరేషన్ల డైరెక్టర్లు ముంతాజ్, జేమ్స్, మనోజ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మారుతి శర్మ, నగర అధ్యక్షుడు కొరకంచి రవి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజ్ కుమార్, సీనియర్ నాయకులు, బూత్ ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు.



