సంక్రాంతి పండుగ సందర్భంగా ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి యువసేన ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు


సంక్రాంతి పండుగ సందర్భంగా ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి యువసేన ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు
డోన్ ప్రతినిధి జనవరి 13 యువతరం న్యూస్:
“సంక్రాంతి పండుగ” సందర్భంగా ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, యువసేన ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు డోన్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి, కార్యాలయం నందు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి, హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలు మన్నె మల్లీశ్వరమ్మ, చాటకొండ సునిత, మన్నె భారతి,తనుజా, శాలిని ప్రకాష్,మన్నె సాత్వీక,మన్నె కావ్య, హాజరయ్యారు.
ముగ్గులపోటిలో గెలుపొందిన వారు
1.మొదటి బహుమతి ఫ్రీడ్జ్ విన్నర్ రమణమ్మ,(సీసంగుంతల,డోన్)
2.రెండవ బహుమతి వాషింగ్ మిషన్, విన్నర్:పి.రామేశ్వరమ్మ(బేతంచేర్ల)
3.మూడవ బహుమతి: టి.వి, విన్నర్: అర్చన(కొత్తపేట,డోన్)
4.నాలుగవ బహుమతి మిక్సర్ గ్రైండర్,విన్నర్ పావని (గోసానిపల్లె)
5.ఐదవ బహుమతి:గ్యాస్ స్టవ్, విన్నర్1.కవిత( ప్యాపిలి),2.విజయ లలితా (టి.ఆర్.నగర్,డోన్)
ఈ కార్యక్రమంలో సీనియర్ టిడిపి నాయకులు చాటకొండ శ్రీనివాసులు,అడ్వకేట్ ఆలా మల్లిఖార్జున రెడ్డి,తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నె గౌతమ్ కుమార్ రెడ్డి,యువ నాయకులు ధర్మవరం మన్నె భరత్ కుమార్ రెడ్డి,సిటి కేబుల్ కిరణ్,హనుమంత రెడ్డి, చనుగొండ్ల కాశీ విశ్వనాథ్ మరియు ధర్మవరం సుబ్బారెడ్డి యువసేన పాల్గొన్నారు.



