భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన

భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం పర్యటన
శ్రీశైలం ప్రతినిధి డిసెంబరు 20 యువతరం న్యూస్:
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ శుక్రవారం శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనార్థం శ్రీశైలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహంలో పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్, శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ, శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వారి దర్శనం చేసుకోవడం తనకు, తన కుటుంబానికి లభించిన గొప్ప అదృష్టమని తెలిపారు. పరమశివుని మరియు అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
శ్రీశైల దేవస్థానంలో శివశక్తుల దర్శనం తనకు, తన కుటుంబానికి మరపురాని అనుభూతిగా నిలుస్తుందని పేర్కొన్నారు. చివరగా “జై భారత్… జై హింద్…”అని నినాదం చేశారు.



