ANDHRA PRADESHBREAKING NEWSOFFICIALSPORTS NEWSWORLD
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
మంత్రి నారా లోకేష్

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
మంత్రి నారా లోకేష్
కర్నూల్ ప్రతినిధి డిసెంబర్ 15 యువతరం న్యూస్:
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 17 వ తేదీ వరకు ఢిల్లీలో జరుగుతున్న 69వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో పాల్గొంటున్న కర్నూలు జిల్లా స్విమర్స్ ను రాష్ట్ర మానవ వనరుల శాఖా, ఐ టీ శాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. డిల్లీ పర్యటనకు వచ్చిన లోకేష్ ను సోమవారం న్యూ ఎంపీ ఫ్లాట్స్ లో క్రీడాకారులు పి. హేమలత, కె. శృతి, సిరి చేతన రాజ్, పి. లహరిలు కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఎంచుకున్న రంగంలో ప్రతిభ చాటుతూ ఉన్నతంగా రాణించాలని సూచించారు.



