ఆదోని జిల్లా సాధన కై ప్రజలు ఉద్యమించాలి
దీక్షకు సంఘీభావం ఎస్ సి ,ఎస్టీ బీసీ,మహిళా సమైక్య నాయకులు

ఆదోని జిల్లా సాధన కై ప్రజలు ఉద్యమించాలి
దీక్షకు సంఘీభావం ఎస్ సి ఎస్టీ బీసీ , మహిళా సమైక్య నాయకులు
ఎమ్మిగనూరు ప్రతినిధి డిసెంబర్ 15 యువతరం న్యూస్:
ఎమ్మిగనూరుపట్టణంలోని లోని వైయస్సార్ సర్కిల్లో ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో 6వ రోజు రిలే నిరాహార దీక్షకు సంఘీభావంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు ఈరమ్మ నాయకులు ఏలీషమ్మ మరియమ్మ హుస్సేన్ బి రంగమ్మ కాసింబి దీక్షకు* కూర్చున్నారు* వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పడితే ఎమ్మిగనూరు మంత్రాలయం ఆలూరు పత్తికొండ నియోజకవర్గం ప్రయాణపరంగా సౌకర్యంగా ఉంటుందని ఆదోని జిల్లా డిమాండ్ ఈనాటిది కాదని 2012 సంవత్సరము నుండి అది ఉందని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్రలో హామీ కూడా ఇవ్వడం జరిగిందని కాబట్టి ఆదోని జిల్లా డిమాండ్ ఈనాటిది కాదని అన్నారు ఆదోని జిల్లా సమంజసమైన నిర్ణయం అనే రైల్వే సౌకర్యం భౌగోళిక పరిస్థితులు రీత్యా కేంద్రంగా ఉంటుందని కొందరు నాయకులు దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఉద్యమం లో ప్రజలు నిదానంగా తీసుకొని ఇది ప్రజల శ్రేయస్సుకై పశ్చిమ ప్రాంత అభివృద్ధి వలసలు కరువు ఆగాలంటే ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గతంలో ఆదోని జిల్లా కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టామని మున్ముందు కూడా ఇంకా చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు శేఖర్ కృష్ణ ఉదయ్ కాజా రఘు అప్రిది నల్లారెడ్డి జేఏసీ నాయకులు గణేష్ బతకన్నా వామపక్ష పార్టీ నాయకులు సత్తెన్న మరియు సత్యనారాయణ రెడ్డి ఇతర సంఘాల నాయకులు పాల్గొన్నారు.



