జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు


ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్య సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు
ఉత్తరాంధ్ర ప్రతినిధి డిసెంబర్ 14 యువతరం న్యూస్
ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు వద్ద జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు తో ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు ముఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అభ్యున్నతికి ఇతర అంశాలకు సంబంధించిన విషయాలను చర్చించారు . అదేవిధంగా ఎమ్మెల్యేలు నుంచి పలు సూచనలు సలహాలను నాగబాబు స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జనసేన పార్టీ విశాఖ నగర మరియు రూరల్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్ , పంచకర్ల రమేష్ బాబు , ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ భీమిలి ఇంచార్జి సందీప్ పాల్గొన్నారు…



