BREAKING NEWS – ఎర్రగుంట్లలో ఆవుల అక్రమ రవాణా వాహనాన్ని పట్టుకున్న పోలీసులు


ఎర్రగుంట్లలో ఆవుల అక్రమ రవాణా పట్టుబడి కలకలం
ఎర్రగుంట్ల నవంబర్ 29 యువతరం న్యూస్ :
ఎక్కడినుంచో రహస్యంగా తరలింపుకు బయలుదేరిన ఆవులను మోసుకుంటూ వస్తున్న భారీ కంటైనర్ ఎర్రగుంట్ల వద్ద అడ్డుకోబడింది. ప్రాంతంలో సంచారం చేస్తున్న విఎచ్పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలైన బాపతి లక్ష్మిరెడ్డి, గరిస రామ్మోహన్ రెడ్డి,మూలె సుదర్శన్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రదీప్ , చంద్రశేఖర్, రాజా తదితరులకు అనుమానం రావడంతో కంటైనర్ను ఆపి పరిశీలించగా — లోపల పదుల సంఖ్యలో ఆవులు దారుణ పరిస్థితుల్లో కుక్కబెట్టినట్లు కనిపించాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్లను విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు. రవాణా ఎక్కడి నుంచి, ఎక్కడికి జరుగుతుందన్న దానిపై పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.
స్థానికులు ఇలాంటి అక్రమ రవాణా నిర్బంధం ఒకటేగాక, పెద్ద నెట్వర్క్ పని చేస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు.
పరిశీలన కొనసాగుతోంది… మరిన్ని వివరాలు త్వరలో.



