ANDHRA PRADESHJOURNALISTNEWSPAPEROFFICIALPROBLEMSSTATE NEWS

జర్నలిస్టుల గౌరవార్థం దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ఉచిత ప్రత్యేక పాసులు మంజూరు చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)

జర్నలిస్టుల గౌరవార్థం దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ఉచిత ప్రత్యేక పాసులు మంజూరు చేయాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి వినతిపత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)

అమరావతి ప్రతినిధి నవంబర్ 29 యువతరం న్యూస్:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు నిష్పక్షపాతంగా, నిజాయితీగా సమాచారం అందించి ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్నిచ్చే పనిచేసే జర్నలిస్టుల గౌరవార్థం, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ప్రత్యేక పాసులు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) వినతి పత్రం అందజేశారు.

రాష్ట్రవ్యాప్తంగా రోజూవారీగా ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మరియు అత్యవసర పరిస్థితుల్లో నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే జర్నలిస్టులు, పండుగలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక దర్శనాలు మొదలైన సందర్భాలలో ప్రజల రద్దీ కారణంగా దేవాలయ దర్శనానికి అవకాశం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం గుర్తించిన, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో వార్షిక ఉచిత దర్శన పాసులు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరారు.

ఆమోదిత మీడియా సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, వారి ఐడెంటిటీ ఆధారంగా, పండుగలు మరియు సాధారణ రోజులలో దర్శనం పొందే విధంగా సౌకర్యం కల్పించవచ్చు. దీనివల్ల రాష్ట్ర దేవాలయాల ప్రచారం, సేవలు, కార్యక్రమాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరటమే కాకుండా మీడియా వర్గాలకు ప్రభుత్వం అందించే గౌరవ సూచకమైన సహకారం అవుతుందని మంత్రికి తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం గుర్తించిన అన్ని దేవాలయాలలో జర్నలిస్టులకు ఉచిత దర్శన పాసులు మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరారు…

మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సమాచార సేకరించి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ ప్రెసెంట్ డాక్టర్ బండి సురేంద్ బండి, “అక్షర భూమి” ద్విభాషా దినపత్రిక ఎడిటర్ బిల్లా రాజు, “ప్రజాకాంక్ష” ఎడిటర్ పి. కృష్ణ, “భారత శక్తి” ఇంచార్జ్ ఈపిపి. కుమార్, “క్యాపిటల్ వాయిస్” ఎడిటర్ పి. బుచ్చిబాబు, “రాజధాని వాయిస్” ఎడిటర్ పూర్ణచంద్రరావు, “ప్రజా రిపోర్టర్” ఎడిటర్ రాజేష్, “ఆంధ్రరేఖ” ఎడిటర్ ఎం. వసంత్, “గుంటూరు నాడి” ఎడిటర్ ఏస్. భాస్కర్, “రఘురాం వార్తలు” ఎడిటర్ రఘురాం, “పల్నాడు వార్త” ఎడిటర్ మామిడి మహేష్, “ప్రజా పాలన” ఎడిటర్ పి. అప్పాజీ, “వజ్ర భారతి” ఎడిటర్ ఏడుకొండలు, “అనూష” తెలుగువారి పత్రిక ఎడిటర్ మాణిక్యరావు, “మా వారధి” తెలుగు దినపత్రిక ఎడిటర్ టి. లక్ష్మీదేవి, “పల్నాడు తెలుగు దినపత్రిక ఎడిటర్ శంకర్రావు, “అఖండ సూర్య” ఎడిటర్ వంగపాటి సురేఖ, “ఇదీ సంగతి” తెలుగు దినపత్రిక ఎడిటర్ కెవి రమణారెడ్డి, “కంజుల” తెలుగు మాసపత్రిక ఎడిటర్, “భారత శక్తి” తెలుగు దినపత్రిక ఎడిటర్ పెంటారెడ్డి, “ఉదయం” తెలుగు దినపత్రిక ఎడిటర్ సిరికొండ మరియా, “ఉదయించే సూర్యుడు” ద్విభాషా దినపత్రిక ఎడిటర్ యలమందరెడ్డి, “దళిత వికాసం” తెలుగు మాసపత్రిక ఎడిటర్ శ్యాం సుందర్, “వాగ్దేవి” తెలుగు మాసపత్రిక ఎడిటర్ కొల్లిపర నాగ కోటేశ్వరరావు, “ఈ సాయంత్రం” తెలుగు డైలీ ఎడిటర్ మాణిక్యరావు,”పవనిజం” తెలుగు దినపత్రిక ఎడిటర్ నజీర్ అహ్మద్ భాషా, “విజయ సారధి” తెలుగు దినపత్రిక ఎడిటర్ పి. వెంకటేశ్వర్లు, “కర్నూలు ప్రభ” తెలుగు దినపత్రిక ఎడిటర్ నజీర్ అహ్మద్ భాష, “సీమకిరణం” తెలుగు దినపత్రిక ఎడిటర్, “అప్ ల్యాండ్ టైమ్స్” ఎడిటర్ బండారు శ్రీనివాసరావు, “మాయావి” తెలుగు దినపత్రిక ఎడిటర్ కోలా లక్ష్మీపతి, “అఖండ భూమి” దినపత్రిక ఎడిటర్ ఎం. ఈశ్వరయ్య, “ఆదిత్య” దినపత్రిక ఎడిటర్ యార్లపాటి శ్రీధర్, “జనం ద విజన్” సాయంకాలం దినపత్రిక ఎడిటర్ వెంకటరమణమూర్తి, “న్యూస్ ఎక్స్ప్రెస్” తెలుగు దినపత్రిక ఎడిటర్ బాసూరి సాయి, “న్యూస్ ఫ్రెండ్” ఎడిటర్ మద్దినేని మానస, “యువతరం” తెలుగు దినపత్రిక ఎడిటర్ ఆర్. చంద్రశేఖర రావు. “రాయల్ స్టార్” తెలుగు దినపత్రిక ఎడిటర్ షేక్ అబ్దుల్ జలీల్, “మన తెలుగు పత్రిక” ఎడిటర్ జలీల్, “అక్షర కృష్ణ” ఎడిటర్ నాగేశ్వరరావు, “దూకుడు” మాస పత్రిక ఎడిటర్ విజయకుమార్, “తెలుగు వార్త” దినపత్రిక ఎడిటర్ ఎస్.కె జలీల్,”మహి” న్యూస్ ఎడిటర్ రామసుబ్బయ్య, విజయ సారథి స్టేట్ ఇన్చార్జి సిరివెళ్ల నాగరాజు, “జై జయం” సాయంకాల దినపత్రిక ఎడిటర్ వేణుగోపాలరావు “ఆంధ్ర రేఖ” బ్యూరో రాజేష్, ఎస్ కె న్యూస్ ఎడిటర్ సిరివెళ్ల గౌరీ పాల్గొన్నారు..

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!