ANDHRA PRADESHEDUCATIONOFFICIALWORLD

విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

విద్యార్థులకు నాసా కిట్ల పంపిణీ

అనంతపురం ప్రతినిధి నవంబర్ 26 యువతరం న్యూస్:

అనంతపురం స్థానిక కమ్మ భవన్ సమీపంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శ్రీ చైతన్య విద్యాసంస్థల ఏజీఎం సుబ్బారెడ్డి చేతులమీదుగా నాసా కిట్ల పంపిణీ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏజీఎం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థి తనను తాను నిరూపించుకునే ఒక అవకాశం కోసం ఎదురు చూసే విద్యార్థుల కోసం శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అవకాశాలు కల్పించడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుందని అన్నారు. అమెరికాకు చెందిన నాస స్పేస్ సంస్థ వారు ప్రతి ఏటా ఇలాంటి విద్యార్థులను వారిలోని ప్రతిభాపాటవాలను వెలికి తేయడానికి, వారికి నాసా పట్ల ఉన్నటువంటి ప్రత్యేక అభిరుచిని తెలుసుకుని శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పిల్లల ప్రతిభ పాటవాలకు తగిన విధంగా ప్రాజెక్టులను,వివిధ రకాలుగా వివిధ రూపాలలో తయారుచేసి తమలోని సృజనాత్మక శక్తిని వెలికి తీస్తూ అద్భుతమైన ప్రాజెక్టులను తయారు చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు తయారు చేసినటువంటి ఈ ప్రాజెక్టులను శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ద్వారా అమెరికాలోని నాసా స్పేస్ సెంటర్ వారికి పంపడం జరుగుతుందని అన్నారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా మా విద్యార్థులు తయారు చేసినటువంటి నమూనాలు ప్రపంచ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తాయి అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య మేనేజ్మెంట్ అందిస్తున్నటువంటి ఈ సహకారంతో విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని ప్రపంచ స్థాయిలో తల్లిదండ్రులకు,ఉపాధ్యాయులకు, చదువుకుంటున్న స్కూలుకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ప్రాజెక్టులను తయారు చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ను మరియు డ్రెస్ కోడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విశ్వనాథ్, కోఆర్డినేటర్ రాధాకృష్ణ, డీన్ లు భవిత మరియు చెన్న కృష్ణారెడ్డి, నాసా ఇంచార్జ్ విద్యాసాగర్, ఒలంపియాడ్ పరీక్షల విభాగం ఇన్చార్జి చంద్రలేఖ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!