భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ల ఏర్పాట్ల పై అధికారుల సమీక్ష

భారత్ – దక్షిణాఫ్రికా మ్యాచ్ ల ఏర్పాట్ల పై అధికారుల సమీక్ష
ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 25 యువతరం న్యూస్:
డిసెంబర్ 6వ తేదీన విశాఖ వేదికగా జరగనున్న భారత్-దక్షిణాఫ్రికా పురుషుల వన్డే మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి చేపడుతున్న ఏర్పాట్లపై మంగళవారం సాయంత్రం విశాఖపట్నం లోని ఏసీఏ-వీడీసీఏ మైదానంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్, నేతృత్వంలో జరిగిన ఈ సమావేశం లో మ్యాచ్‌కు సంబంధించిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, మైదానం నిర్వహణ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కీలక అంశాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖ బ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేకించి ప్రవేశ ద్వారాల వద్ద రద్దీని నియంత్రించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రతను నిర్ధారించడానికి పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని సమర్థవంతమైన కమ్యూనికేషన్ కోసం అప్ గ్రేడ్ చేయబడిన కేంద్రీకృత పబ్లిక్ అడ్రెస్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు క్రికెట్ జట్లు వారి బృందాల భద్రత కోసం ప్రత్యేకంగా పోలీస్ అధికారులను నియమించడం జరిగిందని ఆయన అన్నారు.
అనంతరం జివిఎంసీ కమిషనర్ కెతన్ గార్గ్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ జీరో వెస్ట్ మేనేజ్మెంట్ తో మ్యాచ్ ను నిర్వహించడానికి ఏసీఏ తో కలిసి సన్నాహాలు చేస్తున్నామని పారిశుద్ధ సమస్యలు ఎక్కడ తలెత్తకుండా సిబ్బందిని ఏర్పాటు చేయనున్నామని స్టేడియంలో జీవీఎంసీ ఆధ్వర్యంలో త్రాగునీటిని అందించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. విశాఖ నగరం ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని జట్లు ప్రయాణించే మార్గాల్లోనూ ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ సుందరీ కరణ పనులు వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశం లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కౌన్సిలర్ విష్ణు దొంతు , ఎసిఏ స్టేడియం చైర్మన్ ప్రశాంత్, విశాఖపట్నం డిసిపి – 1 సిహెచ్ మణికంఠ , డిసిపి డి.మేరీ ప్రశాంతి, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎపిఈపిడిసిఎల్ విభాగం అధికారులతో పాటు ఎసిఎ సిబ్బంది పాల్గొన్నారు.



