జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎం ఉజ్వల యోజన
జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్


జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎం ఉజ్వల యోజన
జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్
కర్నూలు కలెక్టరేట్ నవంబర్ 25 యువతరం న్యూస్:
జిల్లాలో అర్హత ఉన్న పేదలు ప్రతి ఒక్కరికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద లబ్ధి చేకూర్చాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన కమిటీకి సంబంధించిన సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి బీపీఎల్ కుటుంబం ఈ పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందే విధంగా చర్యలు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లైస్ అధికారులను ఆదేశించారు. అర్హులైన వారు రేషన్ కార్డు, ఐడెంటి ప్రూఫ్ తీసుకొని సమీప గ్యాస్ ఏజెన్సీ కి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలన్నారు. దీపం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు మహిళా శక్తీకరణకు, ఆరోగ్యకర కుటుంబాలకు, ఇంటి వంటల్లో శుభ్రత–సురక్షకు ఎంతో ముఖ్యమన్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో డెలివరీ బాయ్స్ అదనపు వసూళ్లు చేయకుండా గ్యాస్ ఏజెన్సీ వారు చూసుకోవాలన్నారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వారు ధర పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని డెలివరీ బాయ్స్ బిల్లు రసీదు ఇవ్వడం తప్పనిసరి అన్నారు. వినియోగదారులు ఎలాంటి అవకతవకలు గమనించినా వెంటనే డిస్ట్రిక్ట్ హెల్ప్‌లైన్ లేదా సివిల్ సప్లైస్ శాఖకు ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే దీపం పథకం, గ్యాస్ సిలిండర్ డెలివరీ పై రాష్ట్ర వ్యాప్తంగా ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ వస్తున్నాయని, ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ లో కర్నూలు జిల్లా సంతృప్తి శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సమావేశంలో ఇంచార్జి సివిల్ సప్లైస్ అధికారి వెంకట రాముడు, గ్యాస్ ఏజెన్సీ లు తదితరులు పాల్గొన్నారు.



