వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు-ఆయన రూటే సపరేటు
లంచాలు తీసుకోవడంలో డ్రైవర్ పాత్ర కీలకం.. ఏసీబీ అధికారులు వెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం వైపు ఒక కన్ను వేయండి......????


వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో ఆయన రూటే సపరేటు-ప్రతి పనికి ఒక రేటు
లంచాలు తీసుకోవడంలో డ్రైవర్ పాత్ర కీలకం
ఏసీబీ అధికారులు ఒక సారి వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం వైపు చూడండి
వెల్దుర్తి నవంబర్ 25 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తహసిల్దార్ కార్యాలయంలో ఆ అధికారి రూటే సపరేటు-ప్రతి పనికి ఒక రేటు అని వెల్దుర్తి మండల ప్రజలు పేర్కొంటున్నారు. వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో చేయి తడపందే పనులు జరగవని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ప్రతి పనికి ఒక రేటు ఉంటుందని ప్రజలు తెలుపుతున్నారు. ముఖ్యంగా సామాన్య ప్రజల వద్ద కూడా అనుబంధ పట్టాలకు, ఇతర ధృవీకరణ పత్రాలకు సైతం లంచాలు తీసుకోవడం గమనించదగ్గ విషయమని ప్రజలు తెలుపుతున్నారు. రైతులు పనుల మీద తహసిల్దార్ కార్యాలయానికి వస్తే నెలల తరబడి తిప్పుకొని లంచాలు తీసుకొని మరీ పనులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. లంచాలు తీసుకోవడంలో కూడా ఆ అధికారి తన డ్రైవర్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఏదైనా పనుల మీద తహసిల్దార్ కార్యాలయానికి రావాలంటే సామాన్య ప్రజలు భయపడుతూ వస్తున్నారు. లంచాలు లేనిదే తహసిల్దార్ కార్యాలయంలో పనులు జరగవని బహిరంగంగానే ఆరోపణలు ఉన్నాయి. తహసిల్దార్ కార్యాలయంలో చేయి తడిపిన వారికే పనులు జరుగుతాయని ప్రజలు గుసగుసలాడుతున్నారు. అవినీతి నిరోధక అధికారులు కాస్త వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయం వైపు చూడండి అని వెల్దుర్తి మండల ప్రజలు వేడుకుంటున్నారు. ఏసీబీ అధికారులకు ప్రజలు ఎలా సంప్రదించాలో అర్థం కావడంలేదని, కనీసం సంబంధిత అధికారుల కార్యాలయాల వద్ద ఉన్న పోస్టర్లను చూసి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడానికి కూడా పోస్టర్లు చించి వేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వెల్దుర్తి తహసిల్దార్ కార్యాలయంలో లంచగొండి అధికారిపై తగు చర్యలు తీసుకొని వెల్దుర్తి మండల ప్రజలను ఆదుకోవాలని మండల ప్రజలు జిల్లా అధికారులను వేడుకుంటున్నారు.



