ఓం కొండ శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి సన్నిధిలో మండల వ్యవసాయ అధికారి


ఓం కొండ శ్రీ ఉమా మహేశ్వర స్వామి వారి సన్నిధిలో మండల వ్యవసాయ అధికారి
ఉమా మహేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించి అనంతరం అన్న ప్రసాదంలు స్వీకరించిన వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
ముద్దనూరు నవంబర్ 17 యువతరం న్యూస్:
ముద్దనూరు మండలంలోని పెనికలపాడు గ్రామంలో వెలసిన ఓం కొండ ఉమామహేశ్వర స్వామి ని దర్శనం పొందినట్లు ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. కార్తీక మాసం చివరి వారం సందర్భంగా సిబ్బందితో కలసి వెళ్లి గ్రామ నాయకుడు కె.వర ప్రసాద్ ఆధ్వర్యంలో స్వామి వారి దర్శనం పొంది ఆలయ పూజారి గోత్ర నామములు చదివి పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు పొంది స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరి పైన ఉండాలి అని అలాగే ప్రతి రైతు సుఖ సంతోషాలతో, పాడి పంటలతో,ధన ధాన్యాలతో సమృద్ధిగా కళకళలాడాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో శివాలయంలో శివ నామ స్మరణాలతో మారు మ్రోగింది. మహిళలు భక్తి శ్రద్ధలతో దీపం వత్తులు వెలిగించి పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయం ప్రాంగణంలో 2000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు మాజీ డిసిసిబి ఛైర్మెన్ , ఆలయ కమిటీ పెద్దలు కె.కాటమయ్య తెలిపారు.అనంతరం మండల వ్యవసాయ అధికారి వెంకట క్రిష్ణారెడ్డి మరియు సిబ్బంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదాన,ప్రసాదంను స్వీకరించినట్లు తెలిపారు.తదుపరి కొండ పైన వెలసిన శ్రీ ఆంజనేయస్వామి స్వామి వారిని దర్శనం పొంది ఆశీస్సులు పొందినట్లు తెలిపారు. కొద్దీ సేపు కొండలో ప్రశాంతంగా ధ్యానం చేసినట్లు తెలిపారు. శ్వాస మీద ధ్యాస అన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతు ఇల్లూరి.బాబుల్ రెడ్డి మరియు సిబ్బంది సందీప్,సుధాకర్,నాగ మణి, కల్పన,డీలర్ అర్జున్ మరియు భక్తులు పాల్గొన్నారు.



