పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు

పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు
జిల్లా అడిషనల్ ఎస్పీ రత్నం
దేవరకద్ర నవంబర్ 6 యువతరం న్యూస్:
ఆటో, బొలెరో, జీపుల్లో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తే చర్యలు తప్పవని జిల్లా అడిషనల్ ఎస్పీ రత్నం హెచ్చరించారు. బుధవారం దేవరకద్ర పోలీస్ స్టేషన్ లో ఆటో ఇతర వాహనాల డ్రైవర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాహనాల్లో పరిమితి ప్రకారం ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు చేర్చాలని సూచించారు. ప్రయాణికులను పరిమితికి మించి తరలించడంతో ప్రమాదాలు చోటుచేసుకుని విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని సూచించారు. ఆటో డ్రైవర్లు ఆటోకు సంబంధించిన ఆర్సి, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ వంటివి అందుబాటులో లేకపోతే ఆటోలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఆటో వాహనాలకు పత్రాలు అందుబాటులో లేకపోతే ఆటో డ్రైవర్ల పై కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తామని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో కేసుల వివరాలను అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగన్న, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



