మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత


మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని స్వయంగా ఆస్పత్రికి తరలించిన మంత్రి
హోం మంత్రికి ప్రజల నుంచి అభినందనల వెల్లువ
ఉత్తరాంధ్ర ప్రతినిధి నవంబర్ 3 యువతరం న్యూస్:
కష్టంలో ఉన్న వారిని చూసి వెంటనే సహాయం చేయాలనే మానవత్వం మరోసారి చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి అనితమ్మ. యలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడిన విషయం తెలుసుకున్న అనితమ్మ తన కాన్వాయ్‌ను ఆపించి స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు.
విశాఖపట్నం నుంచి నక్కపల్లి వైపు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాద ఘటనను చూసిన అనితమ్మ క్షణం ఆలస్యం చేయకుండా క్షతగాత్రులను ఆదుకున్నారు. గాయపడిన వారిని సాంత్వనపరుస్తూ, సిబ్బందికి తక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించారు. అనంతరం బాధితులను ప్రభుత్వ వాహనాలు అంబులెన్స్‌ల ద్వారా యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు.
తరువాత ఆస్పత్రికి చేరుకుని వైద్య సేవల పురోగతిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారితో మాట్లాడుతూ ధైర్యం నింపి, అవసరమైన సహాయాన్ని అందించారు. ఓ సామాన్య మహిళలా మారి బాధితులను ఓదారుస్తూ సపర్యలు చేసిన అనితమ్మను చూసి స్థానిక ప్రజలు “నాయకురాలంటే ఇలానే ఉండాలి” అని ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రజల జీవితాల పట్ల చూపిన సానుభూతి, మానవతా విలువలను ప్రతిబింబించిన ఈ చర్యకు సామాజిక వర్గాలనుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



