పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసిన డీఎస్పీ, సీఐ పులిశేఖర్, జొన్నగిరి ఎస్సై కు ప్రశంసా పత్రాలు


పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసిన డీఎస్పీ, సీఐ పులిశేఖర్, జొన్నగిరి ఎస్సై కు ప్రశంసా పత్రాలు
ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా తీసుకున్న అధికారులు
పత్తికొండ రూరల్ అక్టోబర్ 31 యువతరం న్యూస్:
పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేసిన పత్తికొండ సబ్ డివిజన్ డిఎస్పి వెంకటరామయ్య,పత్తికొండ రూరల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ కు జొన్నగిరి ఎస్ ఐ మల్లికార్జున ను శుక్రవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఎస్పీ విక్రాంత్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో సమర్థవంతంగా పనిచేస్తున్న అధికారులకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామన్నారు.. ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా చేసిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. పోలీసులు ప్రజలకు నిత్యము అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. కష్టపడే పని చేసే అధికారులకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉండి అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



