అంధత్వ బాధితులకు ఆపద్బాంధవుడు ఈ సంజీవుడు
రాష్ట్రస్థాయి అవార్డులు, రివార్డులు ఈయనకు మాత్రమే సాధ్యం


అంధత్వ బాధితులకు ఆపద్బాంధవుడు ఈ సంజీవుడు
శుక్లాల బాధితుల పట్ల సంజీవని మంత్రం ఆయన సొంతం
రాష్ట్రస్థాయి అవార్డులు, రివార్డులు ఈయనకు మాత్రమే సాధ్యం
ఒకేసారి 1075 కంటి ఆపరేషన్ లతో రాష్ట్రస్థాయి రికార్డు
భద్రాద్రి అక్టోబర్ 31 యువతరం న్యూస్:
మానవ జన్మకు భగవంతుడు ప్రసాదించిన శరీర అవయవాలలో విలువైన వాటిలో కంటి చూపు చాలా ప్రాముఖ్యమైనది. అటువంటి నేత్రాలను సంరక్షించుకునే క్రమంలో ఆహార అలవాట్లు వయసు పెరగటం నేటి సమాజంలో ప్రతి ఒక్కరు చరవాణి బాధితులుగా మారటం తదితర కారణాల మూలంగా కంటి చూపు బాధితులు క్రమక్రమంగా పెరగడం జరుగుతుంది. కంటి చూపు సమస్యను జయించే క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఏజెన్సీ జిల్లా కావడం మూలాన అవగాహన లోపంతో చాలామంది సమస్యను గుర్తించకపోవడం మూలన బాధితుల సంఖ్య అలానే పెరుగుతూ వస్తుంది మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో నిరుపేదలైన అందులకు వైద్యాన్ని అందిపుచ్చుకోవటం ఒక సమస్యగా మారిన నేపథ్యంలో అందత్వ బాధితులు శుక్లాల బాధితుల పట్ల నేనున్నాను అంటూ తనలో ఉన్న సేవా గుణాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తూ వారి నేత్ర సమస్యలను తీర్చడంలో ప్రముఖ పాత్రను పోషిస్తున్న మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్యులు గంజికుంట్ల సంజీవరావు తనకంటూ ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆయన సేవలు మరువలేనివి.
భద్రాద్రి జిల్లాలో 1995 సంవత్సరము నుండి నేటి వరకు పినపాక నియోజకవర్గమే కాకుండా భద్రాచలం ఏరియాలోని గిరిజన ప్రాంతాలలో కంటి శుక్లాలో బాధపడుతున్న వారి కోసం స్వచ్ఛంద సంస్థల సహకారంతో వందల సంఖ్యలో నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి వేల సంఖ్యలో కంటి ఆపరేషన్లు చేపించి వారికి కంటి చూపును ప్రసాదించటం జరిగినది. తను ఉద్యోగంలో చేరిన నాటి నుంచి కూడా గిరిజన ప్రాంతాలలో తిరిగి గ్రామ గ్రామాన నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించి కంటి శుక్లాలు కలవారందరినీ గుర్తించి వారికోసం స్వచ్ఛంద సంస్థలైనటువంటి లైన్స్ క్లబ్స్, వాసవి క్లబ్స్,రోటరీ క్లబ్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి సంస్థల సహకారంతో ప్రాంతీయ కంటి వైద్యశాల వరంగల్లు, సరోజినీ దేవి కంటి వైద్యశాల హైదరాబాద్, శ్రీకృష్ణ నేత్రాలయం భీమవరం, ప్రభుత్వ ఆసుపత్రి ఖమ్మం లాంటి ప్రాంతాలలో కంటి ఆపరేషన్లు చేపించి ఎంతోమంది జిల్లా కలెక్టర్లు, మంత్రులు,రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం సంజీవరావు సేవలను అభినందించి అవార్డ్స్ అందించడం జరిగినది.
కంటి ఆపరేషన్ లతో రాష్ట్రస్థాయి రికార్డులు:
సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నందు ఒకేరోజు వాజేడు, వెంకటాపురం,చర్ల ఏరియా వారిని 243 మంది కంటి శుక్లాలతో బాధపడుతున్న వారిని చేర్పించి రికార్డు సృష్టించటం జరిగినది. ములకలపల్లి మండల వాసులు 127 మందిని ఒకేరోజు ప్రాంతీయ కంటి వైద్యశాల వరంగల్ నందు చేర్పించడం అది కూడా ఒక రికార్డుగా మిగిలినది. 2021-22 సంవత్సరములో మణుగూరు నుండి రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ నుండి సికింద్రాబాద్ పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సహకారంతో 409 మందికి కంటి ఆపరేషన్లు చేయించడం జరిగినది. భద్రాచలం ఏరియా ప్రాంత ప్రజలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 519 మందికి కంటి ఆపరేషన్లు చేపించడం జరిగినది. 2023-24 సంవత్సరములు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి నందు 1075 కంటి ఆపరేషన్లు చేపించి రాష్ట్ర స్థాయి రికార్డుగా మిగిల్చడం జరిగినది. ప్రస్తుతం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారం తో 507 మంది కంటి శుక్లాలతో బాధపడుతున్న వారికి పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ నందు కంటి ఆపరేషన్లు చేయించడం జరిగినది.
సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన నేత్ర వైద్యులు డాక్టర్ సంజీవరావు.
నేలకొండపల్లి మండలం, చెన్నారం గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ గంజికుంట్ల సంజీవరావు. తన ఉద్యోగ ప్రస్థానాన్ని 1995 ఆగస్ట్ 24న పినపాక మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేత్ర వైద్యులుగా నియమితులవటం జరిగింది. తన నేత్ర వైద్య ప్రస్థానాన్ని నిరాటంకంగా ఎటువంటి విమర్శలకు, వివాదాలకు తావు లేకుండా 30 సంవత్సరాలుగా పినపాక, కరకగూడెం, మణుగూరు మండలాల్లో తన సేవలను అంధులకు అందించడం జరిగినది.2023 నందు సంజీవరావు సాధారణ బదిలీల్లో భాగంగా పినపాక మండలం నుండి కామేపల్లి మండలానికి బదిలీ అవ్వడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో పారన్ సర్వీస్ డిప్యూటేషన్ లో భాగంగా కొత్తగూడెం కు బదిలీ చేయించుకోవడం జరిగినది. భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్,డిసిహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు సహకారంతో ఏరియా ఆసుపత్రి మణుగూరు నందు డిప్యూటీషన్లో వర్క్ చేయడం జరుగుచున్నది. మణుగూరులో జాయిన్ అయిన దగ్గర నుండి నేటి వరకు 1582 మందికి కంటి ఆపరేషన్లు చేపించి వారికి కంటి చూపులు ప్రసాదించటం జరిగినది. సుమారు 20వేల పైచిలుకు మందికి కంటి ఆపరేషన్లు చేయించి వారికి కంటి చూపుని ప్రసాదించడం జరిగింది.
ప్రభుత్వం, అధికారులు సహకారం మరువలేనివి :
అందుత్వ బాధితుల పట్ల వివిధ సంస్థలు సహకారంతో ఎంతోమందికి సేవ చేయగలిగిన భాగ్యం తనకు దక్కిందని ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు నాతోటి ఉద్యోగుల సహకారం మరువలేనిదని ఈ జన్మకి ఇంకేమీ కావాలని సంజీవరావు మాట్లాడుతూ తెలిపినారు. గిరిజన ప్రాంతంలో నిరుపేదలైనటువంటి వారికి సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం కూడా నన్ను గుర్తించిందని, జిల్లా కలెక్టర్లు, మంత్రులు అందరూ కలిసి సుమారు 32 సార్లు అవార్డు లు అందించారని నా ఉద్యోగ జీవితానికి, ఈ జన్మకి సార్ధకత లభించిందని నేత్ర వైద్యులు గంజికుంట్ల సంజీవరావు తెలిపారు.



