మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
పాములపాడు అక్టోబర్ 30 యువతరం న్యూస్:
పాములపాడు మండలంలో
ముంథ తుఫాను ప్రభావం వల్ల చేతికి వచ్చిన మొక్కజొన్న పంటల పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రభుత్వం అన్నదాతలను వెంటనే ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి డి స్వామన్న మండల నాయకులు టి వెంకటేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం సిపిఎం నాయకులు చెల్లి మెల్ల ఇస్కాల లింగాల గ్రామాలలో పర్యటించి వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను ఆరబోసిన మొక్కజొన్న కంకులను వారు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోంత తుపాను వల్ల మొక్కజొన్న, మిరప, ఉల్లి ,సోయాబీన్ రైతులు పూర్తిగా కుదేలు అయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు వ్యవసాయ అధికారులు పంట నష్టపరిహారం క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా వేయాలన్నారు అంతేకాక ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



