మోంతా తుఫాన్ తో కొత్తపల్లి మండలం అష్టదిగ్బందం


మోంతా తుఫాన్ తో కొత్తపల్లి మండలం అష్టదిగ్బందం
పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం
చేతికొచ్చిన పంట నీటి పాలవ్వడం తో రైతులుకు దిక్కు తెలియని పరిస్థితి
కొత్తపల్లి అక్టోబర్ 30 యువతరం న్యూస్:
మండలంలో మొంథా తుపాన్ అతల కుతలమయ్యింది మంగళవారం ఉదయం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కొత్తపల్లి, మండలాల్లో వాగులు పొంగి, పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపొయ్యాయి. గ్రామాల్లో కాలనీలు జలమయం అయ్యాయి ప్రముఖ క్షేత్రాలైనా కొలనుభారతి, సంగమేశ్వరం క్షేత్రాలకు వెళ్లేందుకు అంతరాయం ఏర్పడింది. మొక్కజొన్న పంట కోత కోసి ఆరబెట్టిన విత్తనాలు వర్షంలో తడిసి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్తపల్లి మండలంలో శివపురం నుంచి ఎం. లింగాపురం వెళ్లేదారిలో పెద్దవాగు పొంగడంతో రాకపోకలు ఆగిపొయ్యాయి శివపురం నుంచి జానాలగూడెం వరకు 12 గ్రామాలకు కొత్తపల్లి మండల కేంద్రానికి, ఆత్మకూరు పట్టణానికి రాకపోకలు ఆగిపొయ్యాయి అలాగే దుద్యాల ఇసుక వాగు పొంగడంతో కొక్కెరంచ, నాగంపల్లి,ఎదురుపాడు, జడ్డువారిపల్లె గ్రామాలకు రాకపోకలు ఆగిపొయ్యాయి దాంతో పూర్తిగా కొత్తపల్లి మండల కేంద్రం అష్టదిగ్బందంలోకి చేరింది.
పాములపాడు మండలంలోని ఇస్కాల భవనాసి వాగు పొంగడంతో ఇస్కాల గ్రామానికి పాములపాడు మండల కేంద్రానికి రాకపోకలు ఆగిపొయ్యాయి పాములపాడు మండలానికి వెళ్లాలంటే ఆత్మకూరు వైపు వెళ్లి 25 కి. మీ ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
చేతికొచ్చిన పంట. నీటి పాలు:
కొత్తపలి మండలంలోని దుద్వాల పెద్ద గుమ్మడాపురం,సింగరాజుపల్లి గ్రామాలో అరబెట్టిన మొక్కజొన్నలు నీట తగిశాయి. నపం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములపాడు మండలంలోని ఇస్కాల భవనాసి వాగు పొంగడంతో ఇస్కాల గ్రామానికి పాములపాడు మండల కేంద్రానికి రాకపోకలు ఆగిపొయ్యాయి పాములపాడు మండలానికి వెళ్లాలంటే ఆత్మకూరు వైపు వెళ్లి 25 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పాములపాడు మండలంలోని చెలిమిల్లవద్ద భవనాసి వాగు ఉదృతి రోడ్డు పై ఎక్కిపారడంతో పాములపాడు, చెలిమిల్ల మధ్య రాకపోకలు ఆగిపొయ్యాయి దాంతో చెలిమిల్ల,లింగాల గ్రామాలతోపాటు, కొత్తపల్లి మండలంలోని ఎం. లింగాపురానికి రాపోకలు ఆగిపొయ్యాయి
చేతికొచ్చిన పంట.. నీటి పాలు:
కొత్తపల్లి మండలంలోని దుద్యాల, పెద్దగుమ్మడాపుం,సింగరాజుపల్లి గ్రామాల్లో అరబెట్టిన మొక్కజొన్నలు నీట తగిశాయి నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కొత్తపల్లి మండలంలోని ఎదురుపాడులో 200 ఎకరాల్లో సాగు చేసిన ఉల్లి పంటలు నీట మునిగాయని, ఉల్లి కుల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీలు జలమయం:
కొత్తపల్లి మండలంలోని దుద్యాల గ్రామ సమీపంలో భవనాసి వాగు పొంగడంతో ముస్లీం కాలనీ జలమయమయ్యింది ఇళ్లలోకి నీరు చేరింది. దాంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముసలిమడుగు, సింగరాజుపల్లి, కొత్తపల్లి, గువ్వలకుంట్ల గ్రామాల్లో రహదారులు జలమయం అయ్యాయి.



