ANDHRA PRADESHDEVOTIONALSOCIAL SERVICEWORLD
శ్రీ కాలభైరవ నిత్యఅన్నదాన సత్రం ఏర్పాటుకు భూమి పూజ


శ్రీ కాలభైరవ నిత్యఅన్నదాన సత్రం ఏర్పాటుకు భూమి పూజ
కొత్తపల్లి అక్టోబర్ 27 యువతరం న్యూస్:
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని శ్రీ కొలనుభారతి అమ్మవారి క్షేత్రానికి వెళ్లే మార్గంలో శివపురం సమీపంలో శ్రీ కాలభైరవ నిత్యం అన్నదాన సత్రం ఏర్పాటు చేసేందుకు నవంబర్ 3న భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీ కాలభైరవ నిత్యాన్నధాన సత్రం కమిటీ నిర్వాహకుడు నాగార్జున గౌడ్ తెలిపారు. శ్రీ కాలభైరవ ఆశీస్సులతో ప్రస్తుతం చిన్న గుడిసె లో నిత్య అన్నదాన కార్యక్రమం సాగుతోంది. శాశ్వతంగా నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు భవన నిర్మాణం చేపడుతున్నట్లు అయన తెలిపారు. భక్తులు తరలివచ్చి భూమి పూజా శుభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.



