
రోడ్డు భద్రత పై పటిష్టమైన చర్యలు చేపట్టండి
కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం కలెక్టరేట్ అక్టోబర్ 25 యువతరం న్యూస్:
జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు,శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తో కలిసి సమావేశం నిర్వహించారు,ఈ సందర్భంగా రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా వాహనాల పార్కింగ్ స్థలాలను గుర్తించాలని, నగరపాలక సంస్థ, ట్రాఫిక్ అధికారులు జాయింట్ తనిఖీ చేసి ప్రైవేట్ భూములను కూడా గుర్తించాలన్నారు. గుత్తి – గుంతకల్లు రోడ్ లోని రోడ్ మరియు ఆర్ఓబిని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరితగతిన పూర్తి చేసి రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస్సులను ఆపేందుకు గుర్తించిన స్థలాల్లోనే మార్కింగ్ వేసి అక్కడే బస్సులు నిలిపేలా మున్సిపల్ కమిషనర్ తో సమన్వయం చేసుకొని ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఐసి వారు అభివృద్ధి చేసిన ఐరాడ్ యాప్ లో సిహెచ్సి మరియు ఏరియా ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారి వివరాలను డేటా ఎంట్రీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు 100 శాతం డేటా ఎంట్రీ చేయాలని, పెండింగ్ ఉండడానికి వీలులేదని, డేటా ఎంట్రీకి సంబంధించి సంబంధిత సిబ్బందికి నిత్యం శిక్షణ నిర్వహించాలన్నారు. జిజిహెచ్ సూపరింటెండెంట్, డిసిహెచ్ఎస్, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ లు వారి పరిధిలోని ఆసుపత్రులలో ఎన్ఐసి వారితో సమన్వయం చేసుకుని ఐరాడ్ యాప్ లో డేటా ఎంట్రీ నమోదు చేయించాలన్నారు. నగరంలోని తపోవనం బైపాస్ వద్ద జాతీయ రహదారిలో స్ట్రీట్ లైట్లను టౌన్ డీఎస్పీతో సమన్వయం చేసుకొని నేషనల్ హైవే వారు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలుల్ ప్రాణాలు చాలా ముఖ్యమని, వారి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు, అనంతరం జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ రోడ్డు భద్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు,
ఈ సమావేశంలో ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, డిటిసి వీర్రాజు, డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, డిఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఈఈ షాకిర్, పిఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్.అండ్.బి ఈఈలు రాజగోపాల్, ప్రసాద్ రెడ్డి, ఎన్టీఆర్ వైద్య సేవ కోఆర్డినేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, జిజిహెచ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, డిసిహెచ్ఎస్ నవీన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.



