ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWS
KURNOOL: వివాహిత దారుణ హత్య




వెల్దుర్తి అక్టోబర్ 22 యువతరం న్యూస్:
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని మండల కేంద్రమైన వెల్దుర్తిలో 14 వ వార్డులో బుధవారం వివాహిత దారుణ హత్య జరిగిన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనతో వెల్దుర్తి పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెల్దుర్తి పట్టణానికి చెందిన ఉజ్మ (36) ఇంట్లో ఒక్కటి ఉండడాన్ని గమనించి హత్యకు పాల్పడి నట్లు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. భర్త విధి నిర్వహణలో భాగంగా డ్రైవింగ్ కు వెళ్లినట్లు సమాచారం. సిఐ మధుసూదన్ రావు, ఎస్సై అశోక్, ట్రైనీ ఎస్సై దివ్యశ్రీ సంఘటన స్థలం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియ రావలసి ఉంది.



