నేషనల్ ‘మలుపులు’.. నాసిరకం పనులు

నేషనల్ ‘మలుపులు’.. నాసిరకం పనులు
లాభాల కోసం ప్రజల ప్రాణాలు బలిగొంటున్న కాంట్రాక్టర్లు, నేషనల్ హైవే అధికారులు
నత్తనడకన 340సి జాతీయ రహదారి
హైకోర్టుకు ఫిర్యాదులు చేస్తున్న బాధితులు
కర్నూలు రూరల్ అక్టోబర్ 19 యువతరం న్యూస్:
కర్నూలు జిల్లా నేషనల్ హైవే పై నాసిరకప్పు లైట్లతో వెలుగు నింపుతున్నారు. అలాగే వాహనదారులకు సూచిక డిస్ప్లేలు అప్పుడే స్క్రీన్ లో ఫేల్ అవుతున్నాయి. ఈ రహదారి పూర్తి స్థాయి లో ప్రారంభం కాకముందే రోడ్డు పగుళ్లు ఫ్లైఓవర్లు చూస్తే ముక్కున వేలేసుకుంటున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చేసిన పనులనే మళ్లీ చేయాల్సి వస్తోంది. పాములపాడు మండలం సమీపంలో శ్రీశైలం ప్రధాన కుడిగట్టు ఎస్‌ఆర్‌ఎంసి ( తెలుగు గంగా ) లో జరిపిన తవ్వకాలలో బయట పడిన బిలుకు (స్పయిల్) ను గుట్టలుగా పేరుకుని ఉంది. ఈ బిలు కును అక్కడే ఒక క్రషర్ నెల కొల్పి సన్నని ముక్కలుగా చేసి అలా తయారైన కంకరను 340సీ జాతీయ రహదారి అడుగు పాటుకు వినియోగించారు. ఈ బిలుకు తగిన విధంగా తొక్కించక (రోలర్ తిప్పి) పోవడం వల్ల నాసిరకం రాతి పలకులు పిండిగా మారుతుంది. ఈ రహదారి విస్తరణ లో నేషనల్ హైవే 340 సి తో ప్రజలు, ఆత్మకూరు – నందికొట్కూరు – కర్నూలు కు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఆసిరకంతో చేసిన పనులు అడుగడుగునా ప్యాచ్ వర్క్‌లతో మేకప్ వేసి, ప్రతి ఫ్లైఓవర్ కి సైడ్ కు వాలుతున్నాయి. తప్పులు కప్పిపుచ్చడానికి నేషనల్ పిడి అధికారి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ! ప్రతి ఫ్లైఓవర్ కి బయటకు ఉబ్బుతుంది వీటికి బయటకు వచ్చిన వాటికి రాడ్లు తో మిషన్ ద్వారా లోపలికి పంపిస్తు మరమ్మతులు చేస్తున్నారు. కొన్ని రోజులకేనా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. 340 సి రహదారి విస్తరణను పరిశీలించాల్సిన అధికారులు చూసి చూడనట్టుగా వెళ్తున్నారు. ఈ రహదారి తొలిదశలోనే నాణ్యతకు బయటకొచ్చింది. నిబంధనలు ‘బైపాస్’ చేస్తూ.. జాతీయ రహదారి 340సీ కోసం మొదట ఇచ్చిన ప్లాన్ అప్రూవల్‌కు భిన్నంగా అక్కడక్కడా అలైన్మెంట్ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తొలి ప్లాన్‌లో లేకున్నా పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామంలో వున్న భూమిలోనే నిర్మాణం చేపట్టడంతో సర్వీస్ రోడ్లు స్థలం చాలక ఇరుగ్గా మారుతున్నాయి.. బన్నూరు గ్రామం వద్ద పాత బ్రిడ్జి పైన హైవే పనులు పూర్తి చేశారు. బ్రిడ్జిని కూల్చి వాటి స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించి వాటిపైన నేషనల్ హైవే రహదారి పనులు జరగాల్సి ఉండగా, పాత బ్రిడ్జి పైనే మరమత్తులతో పూర్తి చేశారు. ఇన్ని ప్రధాన సమస్యలు ఉన్నప్పటికీ నేషనల్ హైవే పిడీ నిర్లక్ష్యంగా వివరించడంపై వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లడానికి అంబులెన్స్ లు, విఐపి కార్లు , అగ్రికల్చర్ కు సంబంధించిన వాహనాలు టోల్ ప్లాజా మీదుగా వెళ్లడానికి ఇరుకు రహదారి లో పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ కాలువపై ఆటోలు , బైకులు, వెళుతున్నాయి. అగ్రికల్చర్ సంబంధించిన ట్రాక్టర్లు అధికలోడుతో డ్రెయిన్ కాలువపై వెళితే పగిలిపోయే పరిస్థితి అక్కడ ఉంది. పిడి నిర్లక్ష్యం లే వీటికి ప్రధాన కారణం అని వాహనదారులు చర్చించుకుంటున్నారు.
పంట కాలువలు పూర్చివేత
రుద్రవరం గ్రామంలో పంట పొలాలు వెళ్లే కాలువలు పూల్చివేశారు. దాదాపు 70 ఎకరాల పంట భూములకు గతంలో కాలువల ద్వారా పంట పొలాలకు వెళ్లడానికి నీరు సులభంగా పంటకు అందించేవారు , నేషనల్ హైవే రహదారి విస్తరణలో కాలువలో పూడ్చివేసి, డ్రైన్ కాల్వలో పంట పొలాలకు నీరు అందించేందుకు ఏర్పాటు చేశారు. పంట పొలాలకు నీరు అందించేందుకు గతంలో ఉన్నట్టు కాలువలు ఏర్పాటు చేయాలి. డ్రైన్ కాలువ నీరు వెళ్లేందుకు ఏర్పాటు చేయడం ద్వారా ముందుగా ఉన్న కాలువ ఎగువకు కావడంతో పంట పొలాలకు వచ్చే నీరంతా డ్రైన్ కాలువలో పడి ముందుకు వెళుతున్నాయి. దీని ద్వారం పంటలకు సక్రమంగా నీరు అందించేందుకు రైతులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.