జిన్నారంలో బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు

జిన్నారంలో బీసీ జేఏసీ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు
జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
పటాన్ చెరువు అక్టోబర్ 19 యువతరం న్యూస్:
పటాన్ చెరువు నియోజకవర్గంలోని జిన్నారం మున్సిపాలిటీలోని గల దుకాణాలను మూసివేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బందుకు సంపూర్ణ సహకారం అందించిన వ్యాపారస్తులు..ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతాం…రాజకీయాలు ఎన్నికల వరకే రిజర్వేషన్ల విషయంలో అందరం ఏకం కావాల్సిన అవశ్యకత ఉంది..రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారు..బీసీ బంద్ తో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి లేకుంటే తెలంగాణలో బిజెపి కనుమరుగైపోతుంది…తెలంగాణ ప్రజా ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుంటే కొన్ని పార్టీలు బిఆర్ఎస్ బిజెపి కపట ప్రేమ చూపిస్తున్నాయని రాష్ట్రంలో సై అని ఢిల్లీలో నై అంటున్న బిజెపి…బీసీ రిజర్వేషన్ 42%సహకరించకుంటే రేపు గ్రామాల్లో బీసీల ఓట్లు ఎలా అడుగుతారని హెచ్చరించినా కాంగ్రెస్ నాయకులు…కావున తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో బీసీ బిల్లులు పాస్ చేయాలని లేకుంటే బీసీలకు న్యాయం జరిగేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలియజేశారు…ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ వైస్ ఎంపీపీ గంగు రమేష్ ,ఉపాధ్యక్షులు రాజు గౌడ్, అండూర్ సత్యనారాయణ, ఊట్ల మాజీ సర్పంచ్ జింకల శివరాజ్ పోతారం మాజీ సర్పంచ్ నిరుడు శ్రీనివాస్ బత్తుల మహేష్ పూజరీ కృష్ణ జింకల రవి నకిర్తి రమేష్ మహేష్ గౌడ్ శంకరయ్య కోటేష్ భాస్కర్ కావలి మోహన్ నీలం లత దిలీప్ మన్నె రఘు అభిలాష్ గౌడ్ కృష్ణ గౌడ్ హరిశంకర్ గౌడ్ జింక రవి పుట్ట సుధాకర్ బాల్ రెడ్డి మహేష్ గౌడ్ నరేందర్ నరసింహులు కృష్ణ లింగం వెంకటేష్ ప్రవీణ్ సాయికుమార్ బాలేష్ గంగు రాజు అర్జున్ ప్రవీణ్ చారి కలీం సామి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.