18న బీసీ బంద్ విజయవంతం చెయ్యండి

18న బీసీ బంద్ విజయవంతం చెయ్యండి
వాడ బలిజ రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్
ములుగు ప్రతినిధి అక్టోబర్ 17 యువతరం న్యూస్:
వాడ బలిజ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్ మాట్లాడుతూ
రేపు 18వ తారీకు శనివారం జరగబోయే తెలంగాణ రాష్ట్ర బందు కి పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ బందుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, రిజర్వేషన్లలో బీసీ ఏ కులాల జాబితాలో మూడవ కులం, బీసీ ఏ రిజర్వేషన్ కేటగిరీలో సీరియల్ నెంబర్ 3 లో వాడ బలిజ కులస్తులుగా అత్యధిక జనాభా కలిగి ఉన్న మనం 42 శాతం రిజర్వేషన్ లలో ఏ,బీ, సి డీ వర్గీకరణను స్థానిక సంస్థల్లో మరియూ చట్ట సభల్లో అమలు చేయించుకోవడానికి ప్రస్తుతం జరుగుతున్న రిజర్వేషన్ లు ఉద్యమంలో పోరాడవలసి ఉంటుంది,,,
మనకు రావాల్సిన వాటా మనకు వచ్చేంతవరకు పోరాటాలు ఉద్యమాలు రాస్తారోకలు నిర్వహించి ఖచ్చితంగా సాధించుకోవలసిందే
కావున ఎక్కడికక్కడ శాంతియుతంగా ప్రతి మండల కేంద్రంలో మన ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాలు, ఆఫీసులు, వాణిజ్య వ్యాపార సంస్థలు, ఆర్టీసీ బస్సులు లారీలు ఇతర వాహనాలు ఏవి రోడ్లపై తిరగకుండా సంపూర్ణ మద్దతుకు సహకరించాలని కోరుతూ బంద్ ప్రశాంతం వాతావరణంలో బందును విజయవంతం చేసేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు,
ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి బీసీ కులాలను కలుపుకొని కాపు మరియు మున్నూరు కాపు సోదరులు బెస్త సోదరులు యాదవ సోదరులు కుమ్మరి సోదరులు రజక సోదరులు నాయి బ్రాహ్మణ సోదరులు కంసాలి సోదరులు పెరిక సోదరులు కమ్మరి వడ్డెర సోదరులు గౌడ సోదరులు పద్మశాలి సోదరులు మైనారిటీ మిగతా బీసీ కులాలను కలుపుకుని తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం అధ్యక్షులు
డర్ర దామోదర్ పిలుపునిచ్చారు.