AGRICULTUREANDHRA PRADESHOFFICIAL

ఉల్లి పంట పక్వానికి వచ్చిన తర్వాతనే కోత జరిగేలా పర్యవేక్షించాలి

ఉల్లి పంట పక్వానికి వచ్చిన తర్వాతనే కోత జరిగేలా పర్యవేక్షించాలి

ఈ పంట నమోదు సక్రమంగా జరగాలి

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు కలెక్టరేట్ అక్టోబర్ 17 యువతరం న్యూస్:

ఉల్లి పంట పక్వానికి వచ్చిన తర్వాతనే కోత జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఖరీఫ్ సీజన్ లో వేసిన ఉల్లి పంటకు సంబంధించి గ్రామాల వారిగా పంట కోత షెడ్యుల్ మరియు వాటిని మార్కెటింగ్ చేసే విధానం పై మరియు రబీ సీజన్ లో వేసే పంటల ప్రణాళిక పై రైతులకు అవగాహన కల్పించే అంశం పై గ్రామ, మండల స్థాయి, డివిజన్ స్థాయి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ లో నాటిన ఉల్లి పంటకు సంబంధించి, పంట కోత ఒకేసారి జరిగి, మార్కెట్ కి తీసుకుని రాకుండా, 110- 120 రోజులు దాటిన తర్వాతే పంట కోత తీసే విధంగా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పర్యవేక్షించాలన్నారు. కోత కోసిన వెంటనే మార్కెట్ కి తీసుకొని రాకుండా ఉల్లిగడ్డ ను పొలంలో బాగా అరబెట్టడం వలన గడ్డల నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, అదే విధంగా గ్రేడింగ్ కూడా చేసుకునే విధంగా చూడాలని సూచించారు. ఆ విధంగా కాని పక్షంలో, నాణ్యత దెబ్బతిని మార్కెట్ లో తక్కువ ధర వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశం పై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఉల్లి కి సంబంధించి మన రాష్ట్రం లోను, ఇతర రాష్ట్రాలలోను మార్కెట్ ధరలు పరిశీలించి, గ్రామాలలోని రైతులకు వాటిపై అవగాహన కల్పించాలని సూచించారు. రైతు ఉత్పత్తి దారుల సంఘముల ద్వారా మార్కెట్ చేసే విధంగా వాటిని బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ లో నాసిరకమైన విత్తనం వేసే ప్రాంతాలలో, అధిక దిగుబడి నిచ్చే మేలు రకాలను ప్రోత్సహించాలని, వాటి ద్వారా గడ్డ నాణ్యత తో పాటు, అధిక దిగుబడి రావటం ద్వారా రైతులకు అధిక ఆదాయం వస్తుందనని సూచించారు. రబీ సీజన్ లో విత్తన ఉత్పత్తి లో బాగంగా, నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ వారి వద్ద ఉన్న మెరుగైన రకాలను ఆయా గ్రామాలలో గుర్తించిన రైతులకు ఇచ్చి విత్తన ఉత్పత్తిని చేపట్టాలని కలెక్టర్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. నీటివనరుల కింద సాగు అయ్యే పంటలకు డ్రిప్ ఇరిగేషన్ పెట్టించే విధంగా ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మండల అధికారులతోనూ, రైతు సేవ కేంద్రాలలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ/ఉద్యాన శాఖ సహాయకులతో ఆయా గ్రామాలలో వేసే పంటల సరళి పై కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఈ పంట నమోదు సక్రమంగా జరగాలని, ప్రతి రైతుతో క్రాప్ ఇన్సూరెన్స్ చేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ముందుగా మీటింగ్ కు హాజరైన నేషనల్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ అధికారి శరవణన్, ఉద్యాన పరిశోదన స్థానం నుండి వచ్చిన శాస్త్రవేత్తదీపిక రెడ్డి మరియు నంద్యాల జిల్లా ఉద్యాన అధికారి రాబోయే రోజులలో ఉల్లి పంట పై చేపట్టవలసిన సాంకేతిక పద్దతుల గురించి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణా రెడ్డి, ఏపీఏంఐపి పిడి శ్రీనివాసులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ సహాయ సంచాలకులు రాజశేఖర్, విజిలెన్స్ ఏ ఒ, వి &ఇ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!