నేడు కర్నూలులో ప్రధాని పర్యటన
కర్నూలులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపియస్

నేడు కర్నూలులో ప్రధాని పర్యటన
కర్నూలులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపియస్
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 16 యువతరం న్యూస్:
నేడు (అక్టోబర్ 16న) కర్నూలులో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ ను , బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపియస్ బుధవారం స్వయంగా పరిశీలించారు.
కర్నూలు నగర శివారు ఓర్వకల్లు మండలం, నన్నూరు టోల్ ప్లాజా దగ్గర రాగమయూరి గ్రీన్‌హిల్స్ లో ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంధర్బంగా అడిషనల్ డిజి ఎన్ . మధుసుధన్ రెడ్డి , ఐజి శ్రీకాంత్, కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ లతో కలిసి రాష్ట్ర డిఐజి ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని మోదీ పర్యటించే ప్రదేశాలలో , హెలి ప్యాడ్ , బారికేడ్లు, విఐపి గ్యాలరీలు, కమాండ్ కంట్రోల్ , రోడ్డు మార్గాలు , ట్రాఫిక్ మళ్ళింపు, పార్కింగ్ ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి, భద్రతా ఏర్పాట్లను డిజిపి పరిశీలించారు. మోదీ పర్యటన సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా జరిగేలా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్ర డిజిపి వెంట డిఐజీలు కోయ ప్రవీణ్, సత్య యేసు బాబు, గోపీనాథ్ జెట్టి , సెంథిల్ కుమార్, ఫకీరప్ప కాగినెల్లి, సీతారాం, ఎస్పీలు విక్రాంత్ పాటిల్, జగదీష్, కృష్ణ కాంత్, షెల్కే నచికేత్ విశ్వనాథ్, దీపికా పాటిల్, పరమేశ్వర్ రెడ్డి, చక్రవర్తి, శ్రీనివాసరావు, గంగాధర్ రావు, ధీరజ్ కునుబిల్లి , సుమిత్ సునీల్, ట్రైనీ ఐపిఎస్ అధికారులు, అడిషనల్ ఎస్పీ లు , డిఎస్పీలు ఉన్నారు.