ANDHRA PRADESHCRIME NEWSOFFICIALSTATE NEWS

రూ.4.5 లక్షల విలువైన 5,900 నిషేధిత కోల్డ్/కఫ్ సిరప్స్ స్వాధీనం

రూ.4.5 లక్షల విలువైన 5,900 నిషేధిత కోల్డ్/కఫ్ సిరప్స్ స్వాధీనం

తయారీదారు బజాజ్ ఫార్ములేషన్స్ (ఉత్తరాఖండ్) పై కేసు నమోదు

4 సంవత్సరాల లోపు పిల్లలకు వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది

వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా కోల్డ్/కఫ్ సిరప్స్ విక్రయించరాదు

నిషేధిత మిశ్రమాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి

ఉత్తరాంధ్ర ప్రతినిధి అక్టోబర్ 14 యువతరం న్యూస్:

ఔషధ నియంత్రణ పరిపాలన డైరెక్టర్ జనరల్ గిరిషా, ఐఏఎస్ ఆదేశాల మేరకు, డ్రగ్స్ కంట్రోల్ విభాగం, విశాఖపట్నం అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్. విజయ్‌కుమార్ పర్యవేక్షణలో, సుమారు రూ. 4.5 లక్షల విలువైన 5,900 “రివికోల్డ్” కోల్డ్/కఫ్ సిరప్స్ సోమవారం మర్రిపాలెం, విశాఖపట్నంలోని కిర్బి లైఫ్ సైన్సెస్ అనే మెడికల్ ఏజెన్సీ వద్ద డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సిరప్స్‌లో క్లోర్‌ఫెనిరమైన్ మాలియేట్ + ఫెనైలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం ఉంది. వీటిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బజాజ్ ఫార్ములేషన్స్, భగవాన్‌పూర్, రూర్కీ, హరిద్వార్ వద్ద తయారు చేశారు.

ఈ సిరప్ బాటిళ్లపై తప్పనిసరిగా ఉండవలసిన హెచ్చరిక — “నాలుగేళ్ల లోపు పిల్లలకు వాడరాదు” — లేబుల్‌పై ముద్రించలేదు. దీని వలన చిన్న పిల్లలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ తెలిపారు.

దీన్ని ఉల్లంఘించడం వల్ల డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం సెక్షన్ 26A ప్రకారం తయారీదారు సంస్థ బజాజ్ ఫార్ములేషన్స్ పై కేసు నమోదు చేయబడింది. స్వాధీనం చేసిన సిరప్స్‌ను తదుపరి చర్యల కొరకు గౌరవ న్యాయస్థానానికి అప్పగించబడతాయి.

ఇటీవల మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో కలుషిత కఫ్ సిరప్స్ వలన చిన్నారుల మరణాలు చోటుచేసుకున్న నేపథ్యంలో, అన్ని లైసెన్సుదారులు నిషేధిత మిశ్రమాలు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి. అలాగే అర్హత కలిగిన వైద్యుని ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకు ఏ కోల్డ్/కఫ్ సిరప్ ఇవ్వరాదు అని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

ఈ చర్యల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్‌రావు, పోలీసులు డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!