శ్రీజ దమ్ముకు ఘనంగా స్వాగతం

శ్రీజ దమ్ముకు ఘనంగా స్వాగతం
బిగ్ బాస్ లో శివంగిగా ప్రత్యేక గుర్తింపు
తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు
ఉత్తరాంధ్ర ప్రతినిధి అక్టోబర్ 14 యువతరం న్యూస్:
నగరానికి చెందిన దమ్ము శ్రీజకు సోమవారం విశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం లభించింది.. ఈ మేరకు శ్రీజ తల్లిదండ్రులు దమ్ము శ్రీనివాసరావు లావణ్య దంపతులతో పాటు కుటుంబ సభ్యులు,, స్నేహితులు సన్నిహితులు..పెద్ద ఎత్తున హాజరై విమానాశ్రయంలో ఘనంగా శ్రీజ ను స్వాగతించారు.. అలాగే వీరంతా శ్రీజను ఘనంగా సత్కరించారు.. కేకు కత్తిరించి శుభాకాంక్షలు తెలియజేశారు.. అగ్నిపరీక్షతోపాటు కామనర్ గా బిగ్ బాస్ లోకి ప్రవేశించిన శ్రీజ ఐదు వారాలపాటు అవలీలగా అనేక టాస్కుల్లో ముందు వరుసలో నిలిచారు.. అలాగే బిగ్ బాస్ శివంగిగా కూడా శ్రీజ పేరు సంపాదించారు.. ఇక ఓట్లు విషయంలో కూడా శ్రీజకు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించింది..
తనకు అభిమానంతో ఓటు వేసి ఆదరించిన వారందరికీ శ్రీజ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మద్దతు అందజేయాలని శ్రీజ కోరారు.. శ్రీజను స్వాగతించిన వారిలో సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తోపాటు పెద్ద ఎత్తున పలువురు పాల్గొనీ శ్రీజకు అభినందనలు తెలియజేశారు.