పాపాఘ్ని నదిలోకి వెళ్లకండి

పాపాఘ్ని నదిలోకి వెళ్లకండి
పులివెందుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ధ్రువ కుమార్ రెడ్డి
వేంపల్లి అక్టోబర్ 13 యువతరం న్యూస్:
ఇటీవల ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా వేంపల్లి పాపాఘ్నినదికి జలకల సంతరించుకుందని, ఇది శుభ పరిణామం అని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామకృష్ణ తో కలిసి పాపాఘ్ని నదిలోకి ప్రజలు ఎవరూ వెళ్లకుండా చూడాలని పోలీసులకు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. వేంపల్లె పంచాయతీ పరిధిలోని పాపాఘ్ని నదిలో ప్రమాదకర గుంతలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు, చిన్నపిల్లలు పాపాఘ్ని నదిని చూడాలనే ఉత్సాహంతో పాటు, ఈత సరదా కోసం అటుగా వెళ్తే నదిలోని గుంతల్లో చిక్కుకునే అవకాశం ఉందని చెప్పారు. పాపాఘ్ని నదిలో గుంతలు ఉన్న చోట ప్రమాద సూచికను తెలియజేస్తూ, పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీసులు కూడా ప్రమాదం జరగక ముందే తగిన జాగ్రత్తలు తీసుకొని నది పరివాహక ప్రాంతంలో గస్తీ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ సుబ్రహ్మణ్యం,వేమయ్య, ఉత్తన్న, బద్రీనాథ్, రాఘవయ్య,బాషా తధిత రులు పాల్గొన్నారు.