దిగ్గజ భారత మహిళా క్రికెటర్లు కు అరుదైన గౌరవం

దిగ్గజ భారత మహిళా క్రికెటర్లు కు అరుదైన గౌరవం
ఉత్తరాంధ్ర ప్రతినిధి అక్టోబర్ 12
యువతరం న్యూస్:
విశాఖ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఎ గ్యాలరీ స్టాండ్‌కు మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ పేరు, మూడో గేట్‌కు రావి కల్పనా పేరు ఆవిష్కరించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, ఐసీసీ చైర్మన్ జైషా, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఏసీఏ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పాల్గొన్నారు.
స్టేడియంలో ఏర్పాటు చేసిన మిథాలీ రాజ్ గ్యాలరీ, రావి కల్పనా గేట్లను ఐసీసీ చైర్మన్ జైషా ఆవిష్కరించారు.
మహిళా క్రికెట్‌లో విశిష్ట కీర్తి సంపాదించిన మిథాలీ రాజ్, రావి కల్పనాలకు ఈ గుర్తింపు ఒక అరుదైన గౌరవంగా నిలిచింది.