జమ్మలమడుగు లో రోటరీ క్లబ్ గవర్నర్ యమ్.కె రవీంద్ర పర్యటన

జమ్మలమడుగు లో రోటరీ క్లబ్ గవర్నర్ యమ్.కె రవీంద్ర పర్యటన
రోటరీ క్లబ్ జమ్మలమడుగు ఆధ్వర్యంలోపలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
జమ్మలమడుగు అక్టోబర్ 12 యువతరం న్యూస్:
12 -10- 2025 ఆదివారము సాయంకాలం 4 గంటలకు రోటరీ క్లబ్ 3160 డిస్టిక్ గవర్నర్ ఎంకె. రవీంద్ర అలాగే వారి సతీమణి ఎంఆర్. వేద జమ్మలమడుగు క్లబ్ కు అఫీషియల్ గా విజిట్ కు వస్తున్నారని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి మరియు రోటరీ క్లబ్ సెక్రటరీ ఈ.సంజీవ రాయుడు తెలిపారు.కావున సభ్యులందరూ రేపటి రోజు సాయంకాలం అందరూ అందుబాటులో ఉండి వారి యొక్క టూర్ ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాను.
జమ్మలమడుగులో డీజీ ప్రోగ్రాం వివరాలు :-
సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు (జమ్మలమడుగు పాలిటెక్నిక్ కాలేజీలో మొక్కలు నాటుట అలాగే గూడెం చెరువులోని గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్ ఇవ్వడం జరుగును.)
సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు,గండికోట సందర్శించడం జరుగుతుంది.7 గంటల నుండి 8 గంటల వరకు
ఎస్ఆర్ఎస్ కన్వెన్షన్ హాల్ కర్నూల్ రోడ్ ( బైపాస్ రోడ్డు దగ్గర) జమ్మలమడుగు నందు క్లబ్ మెంబర్స్ అందరo డీజీ తో మీటింగ్ లో పాల్గొంటాము.అలాగే ఆ సమయంలో జమ్మలమడుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న గాలిపోతుల సుబ్బరాయుడు ఇటీవల కడప కలెక్టర్ నుంచి బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ గా అవార్డు అందుకున్నారు. వీరికి,అలాగే బిఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ) ఢిల్లీ వారు నిర్వహించిన క్విజ్ కాంపిటీషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు నందిని అమ్మాయి రాష్ట్రస్థాయిలో ఫస్ట్ రావడం అలాగే అదే స్కూల్ నుంచి 9వ తరగతి చదువుతున్న అబ్బాయి ముక్తేష్ సెకండ్ రావడం జరిగింది. వీరికి రోటరీ క్లబ్ తరఫున గౌరవించడం జరుగుతుంది. అలాగే డీజీ దంపతులకు క్లబ్ మెంబర్స్ అందరం కలిసి సన్మానించడం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల నుండి 8:30 నిమిషాల వరకు డిన్నర్ ఉంటుంది..కావున సభ్యులందరూ తప్పకుండా డిస్ట్రిక్ట్ గవర్నర్ (డీజీ) అఫీషియల్ విజిట్ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా మరి మరి రోటరీ పెద్దలు,సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాము.