ఏఎం మొబైల్స్ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

ఏఎం మొబైల్స్ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
రక్తదానం మహాదానం మీ రక్తం ఇతరులకు ఆశాజ్యోతి
యాడికి అక్టోబర్ 08 యువతరం న్యూస్:
యాడికి మండల పరిధిలోని రాయలచెరువు నందుగల ఏ ఏం మొబైల్స్ మరియు ఫ్యాషన్స్ యాజమాన్యం వారు వ్యాపార రంగంలోకి అడుగుడి ఏడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు కట్టుబడి అజయ్, పర్లపాటి మహేంద్ర తెలియజేశారు. మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ యాడికి మరియు సేవా బ్లడ్ సెంటర్ తాడిపత్రి వారి సహకారంతో బుధవారం ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా 55 మంది రక్తదాతలు తమ రక్తాన్ని దానం చేసినట్లు సేవా బ్లడ్ సెంటర్ తాడిపత్రి వారు తెలిపారు.కార్యక్రమంలో మొదటగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్త దానం అనేది ప్రాణదానంతో సమానమని రక్త దానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని అది అపోహ మాత్రమేనని రక్తదానం చేయడం వల్ల మనలో కొత్త రక్తం ఉత్పత్తి అవుతుందని తెలియజేశారు. 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులైన యువతి, యువకులు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనవచ్చని మీరు చేసే రక్తదానం మరో ముగ్గురికి ప్రాణదానం కలిగిస్తుందని కావున ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేయాలని ఏ ఎం మొబైల్స్ మరియు ఫ్యాషన్స్ వారు రక్త దాతలకు పిలుపునివ్వడం జరిగింది. అనంతరం జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదాతలు స్వచ్ఛందంగా పాల్గొని తమ విలువైన రక్తాన్ని దానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం. మొబైల్స్ మరియు ఏ.ఎం. ఫ్యాషన్స్ యజమానులు కట్టుబడి అజయ్, పర్లపాటి మహేంద్ర, గురుస్వామి, యాడికి మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు బండారు బాలకృష్ణ, చందగాని ధ్రువ నారాయణ, ఆలూరు చంద్రశేఖర్ రెడ్డి, సాకరే శంకరప్ప, టీ లక్ష్మీకాంతమ్మ, కాయపాటి నరేష్ యాదవ్, సేవా బ్లడ్ సెంటర్ తాడపత్రి నిర్వాహకులు పేరి అశోక్ కుమార్, పేరి విజయకుమార్, పేరి పవన్ అమిలినేని కుల శేఖర్ నాయుడు మరియు ఇంకా పలువురు రాజకీయ స్వచ్ఛంద సంస్థల వ్యక్తులు,ఏ.ఎం.ప్యాషన్స్ మరియు ఏ.ఎం. మొబైల్స్ వినియోగదారులు ,శ్రేయోభిలాషులు పాల్గొనడం జరిగింది