రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహనికి పూల మాల వేసిన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి
గాంధీజీ సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించిన రోటరీ సెక్రటరీ, జోనల్ సెక్రటరీ మరియు రోటరీ సభ్యులు
జమ్మలమడుగు అక్టోబర్ 03 యువతరం న్యూస్:
రోటరీ క్లబ్ జమ్మలమడుగు ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మరియు ముద్దనూరు మండల వ్యవసాయ అధికారి మారెడ్డి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోటరీ సంస్థ తరుపున గాంధీ జయంతి సందర్భంగా పాత బస్టాండ్ లో ఉన్న గాంధీ మహాత్ముడు విగ్రహానికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వెంకట క్రిష్ణారెడ్డి, సెక్రటరీ సంజీవ రాయుడు మరియు రోటరీ సభ్యులు కలసి పూల మాల వేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రోటరీ ప్రెసిడెంట్ వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ.. గాంధీజి చేసిన సేవలను కొనియాడారు.ఆయన కృషి పట్టుదల,ఆయన పోరాటం తోనే భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అన్నారు.గాంధీజి కలలు కన్న గ్రామ స్వరాజ్యం కొరకు ప్రతి ఒక్కరు ఆయన అడుగు జాడల్లో నడవాలి అని తెలిపారు.అహింసా మార్గంలో, ఆయన స్వాతంత్ర్యము కొరకు పోరాటం చేసారని తెలిపారు. గాంధీజీ మన మధ్య లేకున్నా మన భారత దేశం కోసం ఆయన చేసిన సేవలు నిరంతరం చిరస్మరణీయంగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతూనే ఉంటాయని తెలిపారు.ఇందులో భాగంగానే జమ్మలమడుగు రోటరీ సంస్థ ఆధ్వర్యంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ,ఆయన జయంతి సందర్భంగా పూల మాలలు వేయడం జరిగింది అని తెలిపారు.అలాగే గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహానికి,అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రోటరీ జోనల్ సెక్రటరీ కుండా భాస్కర్ మాట్లాడుతూ.. రోటరీ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవలను సమాజానికి ఉపయోగపడేలా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ పెద్దలు ,సభ్యులు,పార్థసారథి, శ్రీనివాసులు,శ్రీధర్ రెడ్డి రోటరీ ప్రసిడెంట్ కుమారుడు యమ్.వి.నిహల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.