ANDHRA PRADESHDEVOTIONALWORLD
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మంత్రి అనగాని ప్రత్యేక పూజలు

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా మంత్రి అనగాని ప్రత్యేక పూజలు
రేపల్లె అక్టోబర్ 01 యువతరం న్యూస్:
దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా రేపల్లె శ్రీ రాజరాజేశ్వరి లలితాత్రిపుర సుందరీ అమ్మవారి ఆలయంలో బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు . శక్తి స్వరూపిణులైన అమ్మవార్ల ఆశీస్సులతో ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు కలగాలని, నా కుటుంబసభ్యులైన రేపల్లె ప్రజలు, రాష్ట ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. కార్యక్రమంలో కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు, మేకా రామకృష్ణ, ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు మద్ది పద్మజ, పొన్నూరు గౌరీ రామకుమారి తదితరులు పాల్గొన్నారు.