ANDHRA PRADESHOFFICIALSTATE NEWS
అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వరద పై సమీక్ష

అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ వరద పై సమీక్ష
రేపల్లె అక్టోబర్ 01 యువతరం న్యూస్:
కృష్ణా నదికి వరదలపై బాపట్ల జిల్లా అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు తో కలిసి కొల్లూరు ఎంపీపీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని అధికారులకు ఆదేశాలిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలి-పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు రాబోయే 4, 5 రోజులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. దీనికి పూర్వం మంత్రి అనగాని ముంపునకు గురైన తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు.