అక్టోబర్ 16 న కర్నూలు జిల్లాకు ప్రధానమంత్రి రాక
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

అక్టోబర్ 16 వ తేది జిల్లాకు ప్రధానమంత్రి రాక
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్
కర్నూలు క్రైమ్ అక్టోబర్ 01 యువతరం న్యూస్:
అక్టోబర్ 16న భారత ప్రధానమంత్రి నరేంద్రమోది ఉమ్మడి కర్నూలు జిల్లా రాక సంధర్బంగా బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కర్నూల్, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారని, మొదటగా నంద్యాల జిల్లా శ్రీశైలం లో మల్లన్న దర్శనం , కర్నూల్ పట్టణంలో జీఎస్టీ సంస్కరణల పై రోడ్ షో నిర్వహిస్తుండడం పై ప్రాథమికంగా సమాచారం అందిన నేపథ్యంలో వాహనాల పార్కింగ్, హెలిపాడ్ ఏర్పాట్లపై ఎపిఎస్పీ 2 వ బెటాలియన్, సిల్వర్ జూబ్లి కళాశాల, గవర్నమెంట్ ఫర్ మెన్ కళాశాల – బి.క్యాంపు, నంద్యాల చెక్ పోస్టు, క్రిష్ణానగర్ హైవే, జోహారాపురం రోడ్డు , కర్నూలు పాతబస్తీ లలో కలియ తిరిగి జిల్లా ఎస్పీ పరిశీలించారు. జిల్లా పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు , సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా , కృష్ణమోహన్ కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్, సిఐలు తేజమూర్తి, కేశవరెడ్డి, విక్రమసింహా, శేషయ్య, నాగరాజారావు,మన్సురుద్దీన్ శ్రీధర్ , ఆర్ ఐలు జావేద్, నారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.