ప్రభుత్వం మారిన ఇంకా వైయస్సార్ జపం
కర్నూలు జిల్లాలో వైయస్సార్ హెల్త్ క్లీనిక్ లకు పేరు తొలగించని వైనం

ప్రభుత్వం మారిన ఇంకా వైయస్ఆర్సీపీ జపం
కర్నూలు జిల్లాలో బోర్డు మారని హెల్త్ క్లినిక్
వెల్దుర్తి సెప్టెంబర్ 30 యువతరం న్యూస్:
ప్రభుత్వ మారిన ఇంకా కొద్ది మంది అధికారులు వైఎస్ఆర్సిపి జపం చేస్తున్నారని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.గతంలో డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ పేరు నేడు ప్రభుత్వం మారిన తొలగించకపోవడం గమనించదగ్గ విషయం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి లోని సచివాలయం 2 పరిధిలోని హెల్త్ క్లినిక్ కు గత ప్రభుత్వం పేరుతోపాటు, గత ముఖ్యమంత్రి ఫోటోను కొనసాగించడం గమనించదగ్గ విషయం. గత ప్రభుత్వం మారిన వెంటనే నూతన ప్రభుత్వం డాక్టర్ వైయస్సార్ విలేజ్ క్లినిక్ పేరును మార్చి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా నామకరణం చేయడం జరిగింది. కానీ నేటికీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫోటోతో పాటు డాక్టర్ వైఎస్ఆర్ క్లినిక్ పేరును కొనసాగించడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని ప్రజలు పేర్కొంటున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నది ప్రజలు ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. నేటికీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫోటో మరియు ఆనాడు సూచించిన పేర్లను హెల్త్ క్లినిక్ పై ఉంచడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటికైనా సంబంధిత అధికారులు కల్పించుకొని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఫోటో తొలగించి మండల ప్రజలు కోరుతున్నారు.