ANDHRA PRADESHOFFICIAL
నగర ప్రధాన రహదారుల వెంట సుందరికరణ పనులు వేగవంతం చేయాలి

నగర ప్రధాన రహదారుల వెంట సుందరికరణ పనులు వేగవంతం చేయాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కర్నూల్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
కర్నూలు నగర ప్రధాన రహదారుల వెంట సుందరికరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన బుధవారపేట, కలెక్టరేట్, గాయత్రి ఎస్టేట్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేస్తూ, నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో డిఈఈ గిరిరాజ్, పట్టణ ప్రణాళికాధికారి అంజాద్ బాష తదితరులు పాల్గొన్నారు.