రేషన్ స్మార్డ్ కార్డులను పంపిణి చేసిన టీడీపీ నాయకులు

రేషన్ స్మార్డ్ కార్డులను పంపిణి చేసిన టీడీపీ నాయకులు
ఎస్. ప్రతాప్ యాదవ్
తుగ్గలి సెప్టెంబర్ 28 యువతరం న్యూస్:
తుగ్గలి మండలం పరిధిలోని బొంది మడుగుల గ్రామంలో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొంది మడుగుల గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప ఆధ్వర్యంలో సర్పంచ్ సలహాదారులు తెలుగుదేశం పార్టీ నాయకులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ నేత్రుత్వంలో గ్రామంలోని రేషన్ డీలర్ గౌరన్న సమక్షంలో గ్రామ ప్రజలకు రేషన్ స్మార్ట్ కార్డు లను సుమారు 575 స్మార్ట్ కార్డులను పంపిణి చేశారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సలహాదారులు ఎస్. ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు రేషన్ సరుకులు తీసుకునే తరుణంలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మాకంగా ప్రజలకు నిత్యావసర సరుకులను రేషన్ షాప్ లలో తీసుకునేందుకు స్మార్ట్ కార్డు అందుబాటులో ఉండేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేస్తూ అదే విధంగా పాత రేషన్ కార్డులో ఉన్న సభ్యులు డిటైల్స్ మొత్తం స్మార్ట్ కార్డు లోనే ఉంటాయని స్మార్ట్ కార్డుల విషయంలో ప్రజలు ఎటువంటి సందేహాలు ఉండకూడదని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ లోని గ్రామ ప్రజలు స్త్రీలు పురుషులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.