
ఘనంగా ఐలమ్మ 130వ జయంతి వేడుకలు
దొరల గుండెల్లో బడబాగ్ని ఐలమ్మ
సిపిఐ జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి
చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు సి. లింగమయ్య
అనంతపురం ప్రతినిధి సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
ఈ భూమినాది… పండించిన పంట నాది… తీసుకెళ్లడానికి దొరెవ్వడు…నా ప్రాణం పోయాకే ఈపంట, భూమి దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మల్చి దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన వీరనారి చిట్యాల ఐలమ్మ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మడమతిప్పని పోరాట యోధురాలు అని జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య కొనియాడారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 130 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి నారాయణస్వామి, చేతి వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి. లింగమయ్య లు మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో పేద కుటుంబంలో ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న జన్మించింది అన్నారు. 1940-44 కాలంలో విసునూర్ దేశ్‌ముఖ్, రజాకార్ల అరాచకాలు ఎక్కువైందన్నారు. తమను దొరా అని పిలువని స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొల్పి, దగ్గరుండి అగత్యాలకు పాల్పడే వారన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులపై ఐలమ్మ ఎర్రజెండా పటిదాన్నారు. తీవ్ర ఆగ్రహం చెందిన దేశ్‌ముఖ్ తన మనుషులను పంపి ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టించాడన్నారు. అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ అయిలమ్మ కుటుంబం ఎరజ్రెండాను వీడ లేదన్నారు. పాలకుర్తిలో , స్మారక భవనాన్ని నిర్మించారన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తి దారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రాజేష్ బి రమణయ్య జిల్లా సమితి సభ్యులు అలిపిర కృష్ణుడు రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులు సి నాగప్ప గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి రఘు, నాయి బ్రాహ్మణ తదితరులు పాల్గొన్నారు. వృత్తి దారుల సమాఖ్య నగర అధ్యక్షులు గోవిందరాజులు ,నగర అధ్యక్షులు టిసి భూషణ, ఐలమ్మ కాలనీ కార్యదర్శి నాగరాజు, చిన్న ,నారాయణస్వామి, లక్ష్మీనారాయణ ,నరసింహులు, పెయింటర్ మారుతి, వీరనారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.