నిర్మించారు… వదిలేశారు

నిర్మించారు… వదిలేశారు
కోడుమూరు సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:
కోడుమూరు పట్టణంలో ఉన్న ప్రధాన వృత్తులలో ఒకటి చేనేత వృత్తి. ఈ వృత్తిపై ఆధారపడి కొన్ని వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కార్మికులకు వస్త్ర ఉత్పత్తి కి అవసరమైన రంగులు అద్దుకోవడం కోసం గత ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టింది.
కోడుమూరు పట్టణంలోని సుందరయ్య నగర్ కు వెళ్లే మార్గంలో ఉన్న ఈ చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. సుమారు రూపాయలు 22.56 లక్షల ఐ హెచ్ డి ఎస్ నిధులతో చేనేత జౌలీ శాఖ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నిధుల కొరతతో కొన్ని పనులు పూర్తికాలేదు. ఏళ్లు గడుస్తున్నా ఎవరు పట్టించుకోకపోవడంతో ఆవరణలో పిచ్చి మొక్కలతో నిండిపోయింది .అధికారులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి భవనాన్ని ప్రారంభించి నేతన్నలకు అందుబాటులోకి తేవాలని నేతన్నలు ,చేనేత కార్మిక సంఘం నాయకులు కోరుతున్నారు.