ANDHRA PRADESHBREAKING NEWSOFFICIAL

వరద సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలి

కృష్ణానది దిగువకు ప్రకాశం వారధి నుంచి 8 -9 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉంది

వరద సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తం కావాలి

కృష్ణానది దిగువకు ప్రకాశం వారధి నుంచి 8 -9 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉంది

రేపల్లె సెప్టెంబర్ 26 యువతరం న్యూస్:

రానున్న ఒకటి, రెండు రోజుల్లో భారీ వర్షాల కారణంగా వరద వచ్చే అవకాశం ఉందని వరద బాధిత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేపల్లె ఆర్డిఓ ఎం రామలక్ష్మి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ (ఐఎండి), యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ (ఈసిఎండబ్ల్యూ ఎఫ్) అంచనాల ప్రకారం ఈనెల 26, 27 తేదీలలో కృష్ణా బేసిన్ లో అతి భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. వారి వారి అంచనాల ప్రకారం, ప్రకాశం బారేజీకి 8 నుండి 9 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా 27 శనివారం రెండవ హెచ్చరిక స్థాయిని దాటే అవకాశం ఉందన్నారు. ఆదే జరిగితే అదనపు నీరు కృష్ణానది దిగువకు విడుదల అవుతుంది. కొల్లూరు, భట్టిప్రోలు, రెపల్లె మండలాల్లో లోతట్టులో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండి రెవెన్యూ విపత్తు నిర్వహణ అధికారులతో సహకరించాలని ఆర్డీవో కోరారు. అత్యవసర సమయాల్లో ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చునన్నారు.

కొల్లూరు మండల కంట్రోల్ రూమ్ : 7794894544.
భట్టిప్రోలు మండల కంట్రోల్ రూమ్ : 8179886300.
రెపల్లె మండల కంట్రోల్ రూమ్ : 9505322959.
రెవెన్యూ డివిజనల్ అధికారి, రెపల్లె ఫోన్ నెంబర్: 08648 293795.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!