మెగా డిఎస్సి -2025 లో భాగంగా ఎంపికైన అభ్యర్థులను విజయవాడలో నిర్వహించే సభకు వెళ్లేందుకు అని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

మెగా డిఎస్సి -2025 లో భాగంగా ఎంపికైన అభ్యర్థులను విజయవాడలో నిర్వహించే సభకు వెళ్లేందుకు అని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాం
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు కలెక్టరేట్ సెప్టెంబర్ 24 యువతరం న్యూస్:
మెగా డిఎస్సి -2025 లో భాగంగా ఎంపికైన అభ్యర్థులు విజయవాడ లో నిర్వహించే సభకు వెళ్లేందుకు అని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి బస్సుల్లో పంపించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.
బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీలో అర్హత పొందిన అభ్యర్థులకు విజయవాడలో ఈ నెల 25వ తేదీన నియామక పత్రాలను అందించనున్న సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2805 మంది అభ్యర్థులను వారి అటెండెంట్ ల తో సహా 123 బస్సులలో తీసుకెళ్తున్న నేపథ్యంలో జెండా ఊపి బస్సులను కలెక్టర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ – 2025 లో ఎంపికైన అభ్యర్థులకి ఈ నెల 25 వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఎంపిక నియామక పత్రాలు అందజేయడము జరుగుతుందన్నారు. అందులో భాగంగా జిల్లాలో ఎంపిక కాబడిన మొత్తం 2805 మందిని రాయలసీమ యూనివర్సిటీ నుండి మొత్తం 123 బస్సులలో అని రకాల సౌకర్యాలు కల్పించి పంపడం జరిగిందన్నారు. ప్రతి బస్సుకు ఒక పోలీస్ ఎస్కార్టు, బస్సులలో మెడికల్ కిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా ప్రతి బస్సుకు డిపార్ట్మెంట్ నుండి ముగ్గురు అధికారులను బస్సు ఇన్చార్జీలుగా నియమించడం జరిగిందన్నారు.. ప్రతి 10 బస్సులకు ఒక నోడల్ ఆఫీసర్ పర్యవేక్షిస్తారన్నారు. నరసరావు పేట మరియు గుంటూరు లో మహిళలకు (8 కేంద్రాలు) మరియు పురుషులకు (10 కేంద్రాలు) విడివిడిగా ఏర్పాటు చేసిన 18 కేంద్రాలలో రాత్రి బస ఏర్పాటు చేయడమైనదన్నారు.. కార్యక్రమము విజయవంతంగా ముగించుకున్న అనంతరము బస్సులు తిరిగి జిల్లా కేంద్రాలకు యథావిధిగా బయలుదేరుతాయన్నారు.
కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ తదితరులు పాల్గొన్నారు.