ANDHRA PRADESHDEVOTIONALWORLD
శ్రీ గాయత్రి దేవి రూపంలో శ్రీ సుంకల పరమేశ్వరి మాత

శ్రీ గాయత్రి దేవి రూపంలో శ్రీ సుంకల పరమేశ్వరి మాత
దేవనకొండ సెప్టెంబర్ 24 యువతరం న్యూస్:
దేవీ శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకరణ రూపంలో కనిపించారు. దేవనకొండ లో సుంకల పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం గాయత్రి దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పులిహోరను నైవేద్యంగా సమర్పించారు.పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.