మానవత్వం చాటుకున్న జనసేన నాయకుడు మధు
ఒకే కుటుంబంలో పోలియోతో బాధపడుతున్న ముగ్గురు చిన్నారులకు చేయూత

మానవత్వం చాటుకున్న జనసేన నాయకుడు మధు.
ఒకే కుటుంబంలో పోలియోతో బాధపడుతున్న ముగ్గురు చిన్నారులకు చేయూత
చింతపల్లి సెప్టెంబర్ 22 యువతరం న్యూస్:
మండలంలోని పెదబరడ పంచాయతీ సిరిపురం గ్రామంలో ఒక కుటుంబానికి తమకు తోచిన సహాయాన్ని అందించి మానవత్వం చాటుకున్న చింతపల్లి జనసేన నాయకుడు పెదపూడి మధు. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు పోలియోతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారని తెలుసుకుని చలించిన ఆయన నిత్యావసర సరుకులతో పాటు కొంత ఆర్థిక సహాయాన్ని సోమవారం సిరిపురం గ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అనేకమంది నిస్సహాయులు, నిర్భాగ్యులు ఉంటారని అలాంటి వారికి మనకు తోచిన సహాయాన్ని అందజేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందన్నారు. సాటి మనిషికి మనిషే ధైర్యం అని, మనకు ఉన్నంతలో ఒకరికి సహాయం చేయడం గొప్ప విషయమన్నారు. కిల్లో నాగేశ్వరరావు, గౌరీ దంపతులకు ఆరుగురు సంతానం కాగా అందులో ముగ్గురు పిల్లలు అంగవైకల్యంతో మంచానికే పరిమితం అవడం బాధాకరమన్నారు. ఇలాంటి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని, తమకు తోచిన సహాయాన్ని వస్తు, ధన రూపంలో అందించాలని ఆయన కోరారు.