
ఇకనైనా విద్యుత్ అధికారులు స్పందించండి
ఇండ్లపై ఎత్తైన స్తంభాలు ఏసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడండి
ములుగు ప్రతినిధి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్:
ములుగు జిల్లా వాజేడు మండలంలో గుమ్మడిదొడ్డి పంచాయతీ లోని లిఫ్ట్ కాలువకు గతంలో వేసినటువంటి 11కే వి కరెంటు లైన్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఇన్లపైనుండి మాములుగా వేసే కరెంటు లైన్ ఎత్తు లో వేశారు,ఇవి జోరుగా వర్షలు కురుస్తున్న సమయం లో మంటలవాస్తున్నాయి,గ్రామస్తులు అంత భయం తో జీవనం సాగిస్తున్నారు,లిఫ్ట్ కాలువ నడవడం లేదు, ఉన్నత అధికార్లకు ఎన్ని సార్లు కంప్లండ్ సేసిన అధికార్లు పట్టించు కోవడం లేదు, ఇప్పుడు 11కే వి వైర్లు తెగి ఇంటిపై పడి అర్ధగంట సేపు మంటలు వచ్చాయి, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ నిర్లక్ష్యం, పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యం, ఎవ్వరు పట్టించు కొని వైనం, ప్రాణహాని జరుగుతే తప్ప అధికారులు స్పందిసరా? ఇకనైనా అధికారులు స్పందించి గుమ్మడిదొడ్డి 11 కెవి ఎత్తైన స్తంభాలేసి ప్రజలకు ప్రమాదాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.