విజయవాడలో కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కుమ్మర సుధాకర్

విజయవాడలో కుమ్మర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కుమ్మర సుధాకర్
డోన్ ప్రతినిధి సెప్టెంబర్ 21 యువతరం న్యూస్
విజయవాడ గొల్లపూడి లోని బీసీ సంక్షేమ భవన్ లో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ లో నూతనంగా నియమింపబడిన డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం మరియు పదవి భాద్యతల స్వీకారమహోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ సందర్బంగా కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ తరుపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకి ఉపముఖ్యమంత్రి కొణిదెలపవన్ కళ్యాణ్ కి ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ కి బీసీ మంత్రి శ్రీమతిసవిత కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.అనంతరం మొదటి సర్వసభసమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా వున్న కుమ్మరి కుల వృత్తిదారుల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిస్కార దిశగా పని చెయ్యాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమశంకర్,జే ఎం డి మరియు శ్రీమతి ఉమాదేవి, జే ఎం డి పాల్గొన్నారు.